వివేకా హత్య కేసు(Viveka Murder case) కొత్త మలుపు తీసుకుంది.
x
వివేకా హత్య కేసు(Viveka Murder case) కొత్త మలుపు తీసుకుంది. ఇప్పటి వరకు నిందితుడిగా ఉన్న దస్తగిరిని సాక్షి గా పరిగణించాలని దస్తగిరి పెట్టుకున్న పిటిషన్ సీబీఐ కోర్ట్(CBI court) అనుమతించింది. ఈ రోజు సీబీఐ కోర్ట్ లో విచారణ జరగగా, తనను నిందితుల(accused) జాబితా లో కాకుండా, సాక్షిగా(Witness) పరిగణించాలని దస్తగిరి పెట్టుకున్న పిటిషన్ ని సీబీఐ కోర్ట్ అనుమతించింది. ఇప్పటి వరకు వివేకా హత్య కేసులో దస్తగిరి ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఈ రోజు కోర్ట్ లో పిటిషన్ వేసిన దస్తగిరిని నిందితుల జాబితాలో నుంచి తొలగించి, ఇక పై అతనిని సాక్షి గా పరిగణించాలని సీబీఐ కోర్ట్ నిర్ణయించింది. అయితే ఢిల్లీ లో జగన్ చేసిన ధర్నా మరుసటి రోజే వివేకా హత్య కేసు కొత్త మలుపు తిరగడం కొసమెరుపు.