మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను శుక్ర‌వారం సీబీఐ కోర్టు పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిల రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను.. పోలీసులు ఈ రోజు ఉద‌యం సీబీఐ కోర్టులో హాజరుపరిచారు.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసు(Viveka Murder Case)లో నిందితుల రిమాండ్‌ను శుక్ర‌వారం సీబీఐ కోర్టు(CBI Court) పొడిగించింది. ఆరుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి(Erra Gangireddy), సునీల్‌ యాదవ్‌(sunil yadav), ఉమాశంకర్‌ రెడ్డి(Uma Shankar Reddy), దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి(devireddy sivasankar reddy), వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి(YS Bhaskar Reddy), ఉదయ్‌ కుమార్‌ రెడ్డి(Uday Kumar Reddy)ల రిమాండ్‌ను జులై 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులను.. పోలీసులు ఈ రోజు ఉద‌యం సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా కోర్టు ఆరుగురు నిందితులకు రిమాండ్‌ పొడిగించింది. దీంతో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇదిలావుంటే.. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఇప్పటికే రెండు ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయగా.. తాజాగా మరో ఛార్జిషీటు దాఖలు చేసింది. హత్య కేసు దర్యాప్తును జూన్‌ నెలాఖరులోగా(నేటితో గ‌డువు పూర్తైంది) పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. తదుపరి విచారణ జూలై 14న జ‌రుగ‌నుంది.

Updated On 30 Jun 2023 4:24 AM GMT
Ehatv

Ehatv

Next Story