Sabitha Indra Reddy : జగన్ అక్రమాస్తుల కేసు.. మంత్రి పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా
జగన్ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు ఉంది. కాగా, కేసు నుంచి తన పేరును తొలగించాలన్న సబిత పిటిషన్ పై విచారణ జరిగింది.
జగన్(Jagan) అక్రమాస్తుల కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indra Reddy) డిశ్చార్జ్ పిటిషన్(Discharge Petition)పై సీబీఐ కోర్టు(CBI Court)లో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి పెన్నా సిమెంట్స్(Penna Cements)ఛార్జ్‌షీట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు ఉంది. కాగా, కేసు నుంచి తన పేరును తొలగించాలన్న సబిత పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే సబితా ఇంద్రారెడ్డిని కేసు నుంచి తొలగించవద్దని సీబీఐ(CBI) వాదించింది. నిబంధనలకు విరుద్ధంగా పెన్నాకు గనుల కేటాయింపులో సబిత ప్రమేయం ఉందన్న సీబీఐ.. గనుల శాఖ మంత్రి(Minister of Mines)గా ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది. సబితా ఇంద్రారెడ్డి ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ వాదించింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాత్రం ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది. ఇదే కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి(IAS Srilakshmi) డిశ్చార్జ్ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్ నుంచి తన పేరును తొలగించాలని ఐఏఎస్ శ్రీలక్ష్మి కోరారు. ఆమె పిటిషన్‌పై విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది కోర్టు.