YS Bhaskar Reddy Arrest : వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) తండ్రి భాస్కరరెడ్డి(Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు పులివెందుల(pulivendula)లోని భాస్కరరెడ్డి ఇంటికి వెళ్లారు.

CBI Arrests Jagan Reddy’s Uncle in Former MP’s Murder Case
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) తండ్రి భాస్కరరెడ్డి(Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున సీబీఐ అధికారులు పులివెందుల(pulivendula)లోని భాస్కరరెడ్డి ఇంటికి వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు భాస్కరరెడ్డిని విచారించారు. అనంతరం భాస్కరరెడ్డిని అరెస్టు చేశారు. భాస్కరరెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి(Raghava Reddy)ని కూడా సీబీఐ(CBI) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు. భాస్కర్ రెడ్డిని మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని తెలిపారు. సెక్షన్ 120 బీ, రెడ్ విత్ 302, 302 ఐపీసీ కింద కేసు నమోదుచేసినట్లు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని.. హత్యకు ముందు, తరువాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడాడని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. 120బీ కుట్ర, 302 మర్డర్, 201 ఆధారాలు చేరిపివేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని సీబీఐ తెలిపింది.
