గన్నవరంలో పెంపుడు పిల్లి(Cat) మృతి ఇప్పుడు పోలీసుల(Police) కు తలనొప్పిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లిని చంపేశారని పక్కింటివాళ్లపై ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. పక్కింటి కుటుంబం మాత్రం పిల్లిని చంపాల్సిన అవసరం మాకేంటి అని వాదిస్తున్నారు. దీంతో అసలు పిల్లి ఎలా చనిపోయిందో తేల్చలేక పోలీసులు సతమతమవుతున్నారు.

పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందని సామెత కానీ గన్నవరం లో పిల్లి మృతి పట్ల పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు

ఇదేంటి పిల్లి కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లడం అనుకుంటున్నారా? నమ్మండి ఇది నిజం.

గన్నవరంలో పెంపుడు పిల్లి(Cat) మృతి ఇప్పుడు పోలీసుల(Police) కు తలనొప్పిగా మారింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లిని చంపేశారని పక్కింటివాళ్లపై ఓ కుటుంబం ఫిర్యాదు చేసింది. పక్కింటి కుటుంబం మాత్రం పిల్లిని చంపాల్సిన అవసరం మాకేంటి అని వాదిస్తున్నారు. దీంతో అసలు పిల్లి ఎలా చనిపోయిందో తేల్చలేక పోలీసులు సతమతమవుతున్నారు.

కృష్ణా జిల్లా(Krishna District) గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్‌ చానా కుమార్తె ఆశాకు గత మార్చిలో తన మేనల్లుడు పర్షియన్‌ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

సాఫీగా జరుగుతున్న ఆ పిల్లి జీవితంలో అనుకోకుండ ఒక విషాద దినం. జూన్ 28వ తేదీ నుంచి పిల్లి కనిపించకుండా పోయింది. పిల్లి ఆచూకీ కోసం తమ ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఈ క్రమంలో రోడ్డుపై పెంపుడు పిల్లి శవమై కనిపించింది. దీంతో తమ పిల్లి మరణానికి పక్కింటి కుమారి కారణమని చానా భావించింది. అంతేకాదు ఇదే విషయమై గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని కోరింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్‌ 429 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తమకు పిల్లిని చంపేంత అవసరం ఏముందని కుమారి ప్రశ్నించింది. తమ పరిసరాల్లో కుక్కలు ఎక్కువగా ఉంటాయని.. అవే ఏమైనా చేసి ఉండొచ్చని కుమారి కుటుంబీకులు వాదిస్తున్నారు. దీంతో అసలు పిల్లిని ఎవరు చంపారనేది తేల్చడం గన్నవరం పోలీసులకు సవాలుగా మారింది.

Updated On 1 July 2023 3:49 AM GMT
Ehatv

Ehatv

Next Story