ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి రాష్ట్రంలో కులగణన ప్రారంభించింది. రెండ్రోజులపాటు ఐదు ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కులగణన జరగనుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కులగణన జరగనుంది. దీంతో కులగణనపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ కులంలో ఎంత మంది ఉన్నారన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఏ సామాజికవర్గం జనాభా ఎంత ఉందో లెక్క తేల్చాల

ఏపీలో నేటి నుంచి కులగణన. దేశంలో తొలిసారిగా బీహార్‌లో కులగణన చేపట్టారు. తర్వాత కులగణన చేపట్టే రెండో రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది. మొదటగా పైలట్‌ ప్రాజెక్ట్‌గా కులగణన చేపడతారు. ఆతర్వాత పూర్తిస్థాయిలో కులగణన నిర్వహించనున్నారు.

ఏపీ ప్రభుత్వం ఈరోజు నుంచి రాష్ట్రంలో కులగణన ప్రారంభించింది. రెండ్రోజులపాటు ఐదు ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా ఈ కులగణన జరగనుంది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కులగణన జరగనుంది. దీంతో కులగణనపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ కులంలో ఎంత మంది ఉన్నారన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఏ సామాజికవర్గం జనాభా ఎంత ఉందో లెక్క తేల్చాలని గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రంపైనా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ కులగణన విషయంలో బీహార్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందే వేసింది. బీహార్‌లో కులగణన చేపట్టడంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వారి వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పింది.

ఈ నేపథ్యంలో ఏపీలోనూ కులగణన చేపట్టడంపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు, రేపు ప్రయోగాత్మక దశలో కులగణన ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాత దానిపై అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో ఈ నెల 27 నుంచి డిసెంబర్ 10 వరకు కులగణన జరగనుంది. కుల గణన కోసం జిల్లాల్లో అధికారులను నియమించారు. ఈ ప్రక్రియను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. కుల గణన కార్యక్రమానికి తహశీల్దార్లు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. కుల గణన కార్యక్రమం గురించి ఇంటింటికీ వాలంటీర్ సమాచారం అందిస్తారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కులాల లెక్కలు సేకరించి ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. పలువురు కుల సంఘాల నేతలు కూడా ఈ ప్రక్రియకు హాజరుకానున్నారు.

Updated On 15 Nov 2023 5:30 AM GMT
Ehatv

Ehatv

Next Story