AP Deputy CM Narayana Swamy : ఏపీ డిప్యూటీ సీఎంపై బేగంబజార్ పీఎస్‌లో కేసు నమోదు
హైదరాబాద్ బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మల్లు రవి ఫిర్యాదు చేయడంతో..

Case registered against AP Deputy CM in Begambazar PS
హైదరాబాద్ బేగంబజార్(Begum Bazar) పోలీస్ స్టేషన్(Police Station)లో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి(AP Deputy CM Narayana Swamy)పై కేసు(Case) నమోదు అయ్యింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మల్లు రవి(Mallu Ravi ఫిర్యాదు చేయడంతో.. మూడు సెక్షన్ల కింద నారాయణస్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) మరణానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi) కారణమని నారాయణ స్వామి వ్యాఖ్యలు చేశారని.. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని మల్లు రవి కోరారు. సోనియాగాంధీపై అసత్య ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై కేసు నమోదు చేయాలని మల్లు రవి పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
బేగంబజార్ పీఎస్‌లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. సోనియా గాంధీ(Sonia Gandhi), చంద్రబాబు(Chandrababu) కలిసి రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Accident)లో చంపారని రాష్ట్ర ప్రజల్లో సందేహం ఉందన్నారు. వాళ్లు ఇద్దరు కలసి వైఎస్ ను చంపారని ప్రజలందరికి తెలుసంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ భయపడని వ్యక్తి వైఎస్ జగన్ ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి.. 16 నెలలు జైల్లో పెట్టారని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) చంద్రబాబు మనిషే.. రేవంత్ గెలవడానికి చంద్రబాబు డబ్బులు పంపించారని నారాయణస్వామి తీవ్ర ఆరోపణలు చేశారు.
