Case Against Dastagiri : వివేకా హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిపై కేసు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో జయమ్మ కాలనీలో ఉంటున్నదస్తగిరి.. అదే వీధికి చెందిన గూగుడువల్లీని తన నివాసంలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తన కొడుకును కాపాడాలంటూ తల్లి కుళ్లాయమ్మ పోలీసులను ఆశ్రయించారు.

Case Against Dastagiri, who became a approver in Viveka’s murder case
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు(Viveka Murder Case)లో అప్రూవర్‌గా మారిన దస్తగిరి(Dastagiri)పై పులివెందుల పోలీస్ స్టేషన్(Pulivendula Police Station)లో సోమవారం కేసు నమోదైంది. పట్టణంలోని సీఎం క్యాంపు కార్యాలయం(CM Camp Office) సమీపంలో జయమ్మ కాలనీ(Jayamma Colony)లో ఉంటున్నదస్తగిరి.. అదే వీధికి చెందిన గూగుడువల్లీ(Guguduvalli)ని తన నివాసంలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నాడని, తన కొడుకును కాపాడాలంటూ తల్లి కుళ్లాయమ్మ(Kullayamma)పోలీసులను ఆశ్రయించారు. కుళ్లాయమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై హుస్సేన్(SI Hussain) వెల్లడించారు. ఈ క్రమంలో దస్తగిరిని పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారించినట్లు పేర్కొన్నారు. తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి, అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..
కుటుంబ అవసరాల నిమిత్తం కుళ్లాయమ్మ, తన భర్త పెద్దగూగుడువల్లీ ఆరు నెలల కిందట దస్తగిరి వద్ద వడ్డీకి రూ.40 వేలు అప్పుగా తీసుకున్నారు. వారం వారం వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. పది రోజుల నుంచి డబ్బులు సక్రమంగా కట్టకపోవడంతో వీరి కుమారుడైన గూగుడువల్లీని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దస్తగిరి తన వెంట తీసుకెళ్లి.. అతని ఇంట్లోనే నిర్బందించాడు.
ఈ విషయమై కుళ్లాయమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై హుస్సేన్ తన సిబ్బందితో కలిసి దస్తగిరి ఇంటికి వెళ్లారు. దస్తగిరి ఇంట్లో నిర్బంధించిన ఆ బాలుడిని విడిపించారు. అనంతరం పులివెందులలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలందించారు. ఈ విషయం తెలుసుకున్న గూగుడువల్లీ బంధువులు, వైసీపీ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యసేవల అనంతరం గూగుడువల్లీని స్టేషన్ కు తీసుకెళ్తుండగా.. పోలీసుల వాహనాన్ని అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
