ఏపీ కేబినెట్ సమావేశం జ‌రుగ‌నుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో..

ఏపీ కేబినెట్ సమావేశం(AP Cabinet Meeting) జ‌రుగ‌నుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు సీఎం జగన్(CM Jagan) అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు(Assembly Sessions) ప్రారంభం కానున్న నేప‌థ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్న పలు బిల్లులపై కేబినెట్ లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తుంది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం ఉదయం 9 గంటలకు శాసన సభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవ్వనున్నాయి. ఐదు రోజులపాటు శాసన సభ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి సమావేశాలను మరో రెండు రోజులు పెంచే అవకాశం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెట్టున్నట్లు సమాచారం. ఇవే కాకుండా కొన్ని ఆర్డినెన్స్ లకు సంబంధించిన బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను ప్రభుత్వం సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

Updated On 19 Sep 2023 10:26 PM GMT
Yagnik

Yagnik

Next Story