దేశంలో ఎన్నికల(Election) సందడి మొదలయ్యింది. రాజకీయపార్టీలన్నీ వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. కొత్త కూటములు ఏర్పడుతున్నాయి. పాత మిత్రులు మళ్లీ కలుస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలకు కూడా గిరాకీ పెరిగింది. నాలుగు డబ్బులు వెనకేసుకోవడానికి ఇంతకు మించిన సీజన్‌ ఆ సంస్థలకు దొరకదు. లేటెస్ట్‌గా ప్రజల మనోగతం పేరుతో సీ-ఓటర్‌ సంస్థ(C-Voter organisation) ఓ సర్వే(Survey) నిర్వహించింది.

దేశంలో ఎన్నికల(Election) సందడి మొదలయ్యింది. రాజకీయపార్టీలన్నీ వ్యూహరచనలో నిమగ్నమయ్యాయి. కొత్త కూటములు ఏర్పడుతున్నాయి. పాత మిత్రులు మళ్లీ కలుస్తున్నారు. ఇదే సమయంలో సర్వే సంస్థలకు కూడా గిరాకీ పెరిగింది. నాలుగు డబ్బులు వెనకేసుకోవడానికి ఇంతకు మించిన సీజన్‌ ఆ సంస్థలకు దొరకదు. లేటెస్ట్‌గా ప్రజల మనోగతం పేరుతో సీ-ఓటర్‌ సంస్థ(C-Voter organisation) ఓ సర్వే(Survey) నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాతిక లోక్‌సభ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే తెలుగుదేశం-జనసేన పార్టీల కూటమికి 17 స్థానాలు లభిస్తాయని సీ-ఓటర్‌ సర్వే చెబుతోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి(YSRCP) ఎనిమిది సీట్లే వస్తాయట! గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 22 స్థానాలు లభించాయి. అంటే 14 ఎంపీ స్థానాలను చేజార్చుకోబోతున్నదన్నమాట! టీడీపీ-జనసేన కూటమికి 45 శాతం ఓట్లు దక్కుతాయని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్‌కు 2.7 శాతం, బీజేపీకి 2.1 శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. ఈ సర్వే ఫలితాలు తెలుగుదేశంపార్టీలో(TDP) ఉత్సాహాన్ని నింపాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో కలవరం కలిగించింది.

అయితే సీ-ఓటర్‌ సంస్థ నిర్వహించే సర్వేలకు ప్రామాణికత ఉండదని, ప్రతీసారి అంచనాలు తలకిందులవుతుంటాయని చాలా మంది చెబుతున్నారు. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా 2019 ఎన్నికల్లో ఆ సంస్థ వేసిన అంచనాలు బెడిసికొట్టాయి. గత నవంబర్‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సీ ఓటర్‌ అంచనాలు గల్లంతయ్యాయి. 2019లో ఎన్నికల్లో టీడీపీ 14 లోక్‌సభ, 90–100 శాసనసభ స్థానాల్లో విజయం సాధిస్తుందని తన సర్వేలో వెల్లడైనట్లు సీ–ఓటర్‌ ప్రకటించింది. చివరకు ఫలితాలను చూస్తే 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చారిత్రక విజయాన్ని నమోదు చేయగా టీడీపీ 23 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇటీవల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలపై సీ -ఓటర్‌ చేసిన సర్వే తప్పింది. ఎన్నికలకు ముందు కాంగ్రస్‌కు 118 నుంచి 130 సీట్లు వస్తాయని చెప్పింది. ఎగ్జిట్ పోల్‌లోనూ ఇంచుమించు ఇదే నంబర్లు చెప్పింది. కాంగ్రెస్‌కు 113 స్థానాల నుంచి 137 స్థానాలు రావచ్చని పేర్కొంది. ఫలితాలలో కాంగ్రెస్‌కు కేవలం 66 స్థానాలు మాత్రమే లభించాయి. చత్తీస్‌గడ్ విషయంలో కూడా సీ-ఓటర్‌ అంచనాలు తారుమారు అయ్యాయి. బ్రహ్మండమైన మెజారిటీతో కాంగ్రెస్‌ గెలుస్తుందని చెప్పింది. అయితే అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది.
దేశంలో ఇప్పటిదాకా జరిగిన అధిక శాతం ఎన్నికల్లో సీ–ఓటర్‌ నిర్వహించిన ప్రీ–పోల్, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు లెక్కలు తప్పాయి.

Updated On 9 Feb 2024 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story