ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గరు రాజ్యసభ(Rajyasabha) సభ్యుల రాజీనామాతో(Resign) ఖాళీలు ఏర్పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గరు రాజ్యసభ(Rajyasabha) సభ్యుల రాజీనామాతో(Resign) ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ సీట్ల ఉప ఎన్నికలకు(By election schedule) షెడ్యూల్‌ వచ్చింది. 'డిసెంబర్‌ 3వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 20వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది' అని ఎన్నికల సంఘం తెలిపింది. వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, హర్యానాలో ఒక్కో స్థానానికి కూడా ఈ నోటిఫికేషన్‌ వర్తించనుంది. ఈ ఖాళీలన్నీ రాజీనామాల వల్ల ఏర్పడినవే కావడం విశేసం. డిసెంబర్‌ 20వ తేదీనే పోలింగ్‌ అయ్యాక సాయంత్రం కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

Eha Tv

Eha Tv

Next Story