ఆ బ‌స్సు ప్రమాదం ప్రయాణికులను కాపాడింది. శ్రీశైలం నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ స‌మ‌యంలోనే నరసరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్‌పోర్ట్‌ లారీ అనుకోని విధంగా ఆ బస్సును ఢీకొట్టింది.

ఆ బ‌స్సు ప్రమాదం(Bus Accident) ప్రయాణికులను కాపాడింది. శ్రీశైలం(Srishailam) నుంచి తెలంగాణ రాష్ట్రం మునుగోడు(Munugodu)కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు(RTC Bus)కు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ స‌మ‌యంలోనే నరసరావుపేట వైపు నుంచి వెళ్తున్న నవత ట్రాన్స్‌పోర్ట్‌(Navatha Transport) లారీ అనుకోని విధంగా ఆ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న‌ట్లైందని.. లేదంటే భారీ ప్రమాదం చూడవలసి వచ్చేదని ప్రయాణికులు చెప్తున్నారు. నవతా ట్రాన్స్‌పోర్ట్‌ లారీ(Lorry) ప్రమాదం రూపంలో బస్సును ఢీకొనడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను కాపాడినట్లు అయింది. ప్ర‌మాదంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పెట్లూరు వారి పాలెం(Petlurivari Palem)-ఉప్పలపాడు(Uppalapadu) మధ్య చోటు చేసుకుంది. బ‌స్సు, లారీ డ్రైవర్లకు ఎటువంటి గాయాలు అవక‌పోవ‌డం విశేషం. అయితే.. బ‌స్సు, లారీలు స్వ‌ల్పంగా దెబ్బ‌తిన్నాయి.

Updated On 4 Sep 2023 12:18 AM GMT
Yagnik

Yagnik

Next Story