Bullet Train: హైదరాబాద్-విశాఖ మధ్య బుల్లెట్ ట్రైన్..!
హైదరాబాద్ (Hydearabad)-విశాఖ (Vizag) మధ్య బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మార్గంలో హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే చివరి అంకానికి చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి కానుంది.
హైదరాబాద్ (Hydearabad)-విశాఖ (Vizag) మధ్య బుల్లెట్ ట్రైన్ (Bullet Train) ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మార్గంలో హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వేశాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే చివరి అంకానికి చేరుకుంది. వచ్చే మార్చినాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి కానుంది. ఎస్‌ఎం కన్సల్టెన్సీకి పెట్ సర్వేకు రైల్వేశాఖ గతేడాది మే నెలలో బాధ్యతలు అప్పగించింది. దీని నివేదిక వచ్చిన తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తామని రైల్వేశాఖ తెలిపింది. దీని నిర్మాణానికి రూ.20,000 కోట్లకుపైగా ఖర్చవుతుందని అధికారుల అంచనా వేసినా పనులు ప్రారంభించే సమయానికి ఈ వ్యయం మరింత పెరిగే అవకాశముంది.
పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో అధ్యయనం చేశారు. వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు మార్గాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌లో హైస్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపై పెట్‌సర్వే నివేదికలో ఇవ్వనుంది. దీని తర్వాత డీపీఆర్ సర్వేకు 6-8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శంషాబాద్ (Shamshabad)–విశాఖకు హైస్పీడ్ రైలు వస్తే శంషాబాద్ నుంచి నాలుగున్నర గంటల్లోనే విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. ప్రతి రోజు దాదాపు 55 వేల మంది జాతీయ ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు కొనసాగిస్తుండగా మరో 10 వేల మందికిపైగా అంతర్జాతీయ ప్రయాణికులు ఉన్నారు. ఈ హైస్పీడ్ రైలు వస్తే శంషాబాద్ ఎయిర్‌పోర్టు నేరుగా విజయవాడ (Vijayawada), విశాఖ, తదితర నగరాలకు చేరుకొనే వీలు కలగనుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, టార్గెట్‌కు అనుగుణంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రానున్న ఐదారేళ్లలో తెలుగు రాష్ట్రాలకు హైస్పీడ్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి.