Buggana Rajendranath : కాపీ కొట్టడం టీడీపీ కాపీరైట్, పేటెంట్ రైట్ : బుగ్గన
కాపీ కొట్టడమెలాగో తెలుగుదేశంపార్టీ(TDP) నుంచి చేర్చుకోవాలని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) అన్నారు. అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన బుగ్గన టీడీపీపై వ్యంగ్య విమర్శలు చేశారు. కాపీ కొట్టడం టీడీపీ కాపీ రైట్, పేటెంట్ రైట్ అని అన్నారు. 'బైబై బాబు' నినాదాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఆందోళన చేస్తుండడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. బుధవారం కరపత్రాలతో టీడీపీ నిర్వహించిన ఆందోళన కూడా కాపీయేనని అన్నారు.

Buggana Rajendranath
కాపీ కొట్టడమెలాగో తెలుగుదేశంపార్టీ(TDP) నుంచి చేర్చుకోవాలని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) అన్నారు. అసెంబ్లీలో(Assembly) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన బుగ్గన టీడీపీపై వ్యంగ్య విమర్శలు చేశారు. కాపీ కొట్టడం టీడీపీ కాపీ రైట్, పేటెంట్ రైట్ అని అన్నారు. 'బైబై బాబు' నినాదాన్ని కాపీ కొట్టి ఇప్పుడు ఆందోళన చేస్తుండడమే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. బుధవారం కరపత్రాలతో టీడీపీ నిర్వహించిన ఆందోళన కూడా కాపీయేనని అన్నారు. పక్క రాష్ట్రాల్లోని ప్రఖ్యాత పథకాలను తీసుకువచ్చి వాటిని కాపీ చేసి అమలు చేస్తామని టీడీపీ చెప్పడం కాపీకి పరాకాష్ఠ అన్నారు. కేవలం సభను జరగనీయకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ ఆందోళన చేస్తుందని చెప్పారు. పేపర్లు చించేసి స్పీకర్ మీద కు విసిరేసి, గట్టిగా అరిచి టీవీల్లో కనబడాలన్న తపనే తప్ప ప్రజా సమస్యలపై టీడీపీకి అసలు చిత్తశుద్ధే లేదని బుగ్గన చెప్పారు. ఆందోళన చేయడానికి ఇష్టపడని టీడీపీ సీనియర్ నాయకులను సైతం బలవంతం చేసి పోడియం దగ్గరకు లాగుతుండడం బాధాకరమన్నారు. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రిగా గతంలో బాధ్యతలు నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్ప, అనుభవజ్ఞులైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గణ వెంకటరెడ్డిలకు అయిష్టంగా ఆందోళన చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎదురుచూసే బడ్జెట్ డే రోజు ఇలా ఆందోళన చేయడం, అడ్డుపడడం వల్ల సభకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో తగు చర్యలు చేపట్టాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. ఆయన సూచన మేరకు టీడీపీ సభ్యులైన నందమూరి బాలకృష్ణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామనాయుడు, రామరాజు, డోలా బాల వీరాంజనేయస్వామిలను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
