Buddha Venkanna : బీసీలను ఇబ్బంది పెడుతున్న సీఎంను తరిమికొట్టండి
వైసీపీ సర్కార్(YCP Sarkar) బీసీలను మోసం చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) ఆరోపించారు. విజయవాడ(Vijayawada)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం(YCP Govt) బీసీలను మోసం చేసి.. ఇప్పుడు మరలా బీసీ బస్ యాత్ర(BC Bus Yatra) చేపట్టారని అన్నారు.
వైసీపీ సర్కార్(YCP Sarkar) బీసీలను మోసం చేసిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) ఆరోపించారు. విజయవాడ(Vijayawada)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం(YCP Govt) బీసీలను మోసం చేసి.. ఇప్పుడు మరలా బీసీ బస్ యాత్ర(BC Bus Yatra) చేపట్టారని అన్నారు. యాత్రకు జనాలు లేక వాయిదా వేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని.. పోలీసులను అడ్డుపెట్టుకొని బస్ యాత్రలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
33 మంది బీసీలను ఉచకోత కోసిన చరిత్ర వైసీపీ సర్కార్ దని మండిపడ్డారు. నాపై 44 కేసులు పెట్టారని వివరించారు. బీసీ మంత్రులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. నా ఫోన్ ఆధారంగా హైదరాబాద్(Hyderabad) వచ్చి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. బీటెక్ రవి(B Tech Ravi)ని చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్(CM Jagan)కు భయం పట్టుకుందని.. పులివెందుల(Pulivendula)లో ఓటమి తప్పదన్నారు. అచ్చెన్నాయుడు(Atchannaidu), అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu), కొల్లు రవీంద్ర(Kollu Ravindra), యనుమల, కాల్వ శ్రీనివాసులు ఇలా బీసీ నాయకులపై వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు.
కొడాలి నాని(Kodali Nani), వంశీ(Vamsi)లపై ఒక్క కేసు లేదన్నారు. పోలీసులు ఒక వారం సెలవు పెట్టండి.. ప్రభుత్వానికి సహాయనిరాకారణ చేయండి.. టీడీపీనో.. వైసీపీనో తేల్చుకుంటామన్నారు. పోలీసులు కూడా ప్రభుత్వంపై రివర్స్ అవ్వాలని సూచించారు. పోలీసులకు ఛాలెంజ్ అనుకోండి.. వార్నింగ్ అనుకోండి.. బీసీలను ఇబ్బంది పెడుతున్న సీఎంను తరిమి కొట్టండని పిలుపునిచ్చారు.