ఉండవల్లి అరుణ్ కుమార్ అవినీతిని బయట పెడతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న అన్నారు. తను నీతిమంతుడని ఉండవల్లి నిరూపించుకోగలరా? అని సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో

ఉండవల్లి అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) అవినీతిని బయట పెడతానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న(Buddha Venkanna) అన్నారు. తను నీతిమంతుడని ఉండవల్లి నిరూపించుకోగలరా? అని సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం(TDP) పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. చంద్రబాబు(Chandrababu)పై సీబీఐ(CBI) ఎంక్వైరీ చేయాలని పిల్(PIL) వేయడం వైసీపీ(YSRCP) నాయకుల కక్ష సాధింపు చర్యల్లో భాగమేన‌న్నారు. చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ అవినీతిలో ఎటువంటి సంబంధం లేదని అన్నారు. కంపెనీలతో ఎటువంటి డీల్ జరగలేదు. అలాంటప్పుడు పిల్ వేయడంలో అర్థంలేదు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించిన చంద్రబాబుపై బ్లాక్ మెయిల్ రాజకీయాలు మొదలుపెట్టారని మండిప‌డ్డారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ ఆస్తులన్నీ హైదరాబాద్(Hyderababad) లో ఉంటాయని.. రాజమండ్రిలో ఏమీ ఉండవన్నారు. ఉండవల్లిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని విమ‌ర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఉండవల్లికి ముడుపులు ముట్టాయని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఉండవల్లి అరుణ్ అబద్ధాలు కట్టిపెట్టాలని హెచ్చ‌రించారు. మచ్చలేని చంద్రుడిపై రాజకీయ కక్ష ఎందుకని మండిప‌డ్డారు. జగన్ రెడ్డికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని జోష్యం చెప్పారు.

Updated On 24 Sep 2023 3:51 AM GMT
Yagnik

Yagnik

Next Story