కేశినేని నానిని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిది.. ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన చిన్ని.. వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారని అన్నారు.
కేశినేని నానిని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిది.. ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన చిన్ని.. వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారని అన్నారు. వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజనా చెప్పారు.. అర్ధం చేసుకోకుండా ఈ సిగ్గులేని నాని నోటి కొచ్చినట్లు వాగుతున్నాడని ఫైర్ అయ్యారు. నానికి వాళ్ల అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదు.. తమ్ముడు నీకు పోటీగా నిలబడితే.. చెల్లి కూడా నీ ఛాయలకు రాలేదు.. ఎవరి ద్వారా లబ్ది, సాయం పొందుతాడో వారినే తిట్టడం నాని నైజం అన్నారు.
సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగేవాడు. సుజనా ద్వారా ఎంత సాయం పొందాడో నాని మరచిపోయాడేమో..మేము దగ్గర ఉండి నాని వేషాలన్నీ చూశాం.. 2014లో వేసిన అఫిడవిట్ లో శ్రీరామ్ చిట్స్ కు డబ్బులు ఇవ్వాలి.. ఐ.ఓ.బి కి ముప్పై కోట్లు బజాయిలు చెల్లించాలి.. 2024 అఫిడవిట్ లో కూడా ఇవే అప్పులు రాశాడు.. పదేళ్ల కాలంగా ఈ అప్పులు ఎందుకు కట్టలేదు నానీ అని ప్రశ్నించారు. డబ్బులు ఎగ్గొట్టినందుకు చీటింగ్ కేసు పెట్టారు.. కార్మికులు ను అన్యాయం చేసినందుకు కేసు పెట్టారు.. ఈ కేసు విషయం అఫిడవిట్ లో నాని ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.
మోసం చేసిన నాని నామినేషన్ ను తిరస్కరించాలన్నారు. కేశినేని నాని చీటర్, 420 అందుకే అనేక మందిని మోసం చేశాడన్నారు. ఆస్తులు, అప్పులు రాసిన నాని.. కేసులు ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే చరిత్ర నీది.. నువ్వు పెద్ద చీటర్ వి.. అందుకే నిన్ను చంద్రబాబు మెడ పట్టి బయటకు గెంటేశారు. ఈ విజయవాడ కు పట్టిన దరిద్రం కేశినేని నాని అంటూ మండిపడ్డారు. కేసుల విషయం దాచిన కేశినేని నాని పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.
నానీ.. నీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే.. నీ ఆస్తులు అమ్మి అయినా అప్పులు కట్టాలి కదా.. నీ దగ్గర పని చేసే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టావు.. వారి కష్టాన్ని దోచుకుని.. మేడలు కట్టావు.. సిగ్గు, శరం ఉందా.. నువ్వా క్యారెక్టర్ గురించి మాట్లాడేది.. నీకు డబ్బులు ఇచ్చిన వారికి అప్పులు చెల్లించి అప్పుడు రా.. నిజాయితీ ఒప్పుకుంటామన్నారు. చీటింగ్ కేసులు ఉన్న నాని పోటీకి అనర్హుడు అన్నారు. పశ్చిమ నియోజకవర్గం లో టిడిపి కార్యకర్తలు కష్టం తో కేశినేని నాని ఎంపి అయ్యాడు.. మేమంతా కూలీలు లాగా, నాని జాగీరు లాగా మాట్లాడతాడు.. ఏరోజు అయినా పేదలకు నీ సొంత డబ్బులు సాయం చేశావా.. చంద్రబాబు, సుజనా చౌదరి వెనుక తిరిగిన చరిత్ర మరచిపోవద్దన్నారు. క్యారేజీలు మోసుకెళ్లి పబ్బం గడుపుకున్న నీచుడు నాని.. నీకు తప్పకుండా ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అబద్దపు అఫిడవిట్ పెట్టిన నాని.. అసలు పోటీ లో లేకుండా చేయాలని కోరుతున్నామన్నారు.