Buddha Venkanna : దేవినేని అవినాష్‌ని జగన్ బలి పశువుని చేయబోతున్నారు
గన్నవరంలో జరగనున్న టీడీపీ బహిరంగ సభలో(TDP Public Meeting) అలజడి సృష్టించేందుకు వైసీపీ(YCP) నాయకులు యత్నిస్తున్నారని పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) అన్నారు. అందుకోసమే దేవినేని(Devineni) అవినాష్(avinash) నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) సమావేశం అయ్యారని అన్నారు.

Buddha Venkanna
గన్నవరంలో జరగనున్న టీడీపీ బహిరంగ సభలో(TDP Public Meeting) అలజడి సృష్టించేందుకు వైసీపీ(YCP) నాయకులు యత్నిస్తున్నారని పార్టీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) అన్నారు. అందుకోసమే దేవినేని(Devineni) అవినాష్(avinash) నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) సమావేశం అయ్యారని అన్నారు. మరోసారి దేవినేని అవినాష్‌ని బలి పశువుని చేసే పనిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. కచ్చితంగా వైసీపీ కుట్ర పన్నాగాలని సమర్ధవంతంగా ఎదుర్కొంటామన్నారు. ఢీ అంటే ఢీ అనే విధంగా తాము కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.
వైసీపీ మూకలు ఏ రూపంలో యువగళం పాదయాత్రలోకి వచ్చినా కచ్చితంగా కనిపెట్టి తరిమికొడతామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరిగిన విధంగా లోకేష్‌కి బెజవాడలో వినూత్న రీతిలో స్వాగతం పలుకుతామని బుద్దా వెంకన్న తెలిపారు. వైసీపీ నేతల సూచనల మేరకు అధికారులు లోకేష్ ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. తాము ఏ అధికారికి ఫోన్ చేసినా ఎత్తడం లేదని చెప్పారు. ఫ్లెక్సీల మీద ఏ ఒక్క వైసీపీ నాయకుడు చేయి వేసినా వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. లోకేశ్ వెళ్లేంత వరకు ఫ్లెక్సీలు ఉండాల్సిందేనని, ఎవరైనా తొలగించాలని చూస్తే ఊరుకోబోమని అన్నారు.
