Buddha Venkanna : చంద్రబాబు జనంలోకి వస్తే రాష్ట్రంలో జన సునామే
టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే నాలుగున్నర ఏళ్లలో వైసీపీ విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నిటిని ఎత్తివేస్తామని.. అధికారంలోకి రాగానే మొదటి సంతకం దానిపైనే అని..

Buddha Venkanna Comments on YSRCP
టీడీపీ(TDP), జనసేన(Janasena) కూటమి అధికారంలోకి వస్తే నాలుగున్నర ఏళ్లలో వైసీపీ(YSRCP) విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నిటిని ఎత్తివేస్తామని.. అధికారంలోకి రాగానే మొదటి సంతకం దానిపైనే అని తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న(Buddha Venkanna) అన్నారు. పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా నరసాపురం(Narasapuram)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ చేపడుతున్నది బీసీ యాత్ర కాదు.. బేవర్స్ బస్సు యాత్ర అని విమర్శించారు. బస్సుల్లో మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు పుల్.. సభలకు జనం నిల్ అని ఎద్దేవా చేశారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న వారంతా పని లేని మంత్రులు అని కామెంట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) రాష్ట్రంలో ఇంతవరకు ఎవరికీ టిక్కెట్లు కేటాయించలేదన్నారు. ఒకవేళ ఎవరన్నా పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటే.. అది అవాస్తవం అన్నారు. చంద్రబాబు మళ్లీ జనంలోకి వస్తే రాష్ట్రంలో జన సునామీనే అని అన్నారు. పొత్తులపై చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకున్న దానికి టీడీపీ శ్రేణులంతా కట్టుబడి ఉంటామన్నారు. రేపటి నుంచి రాజోలు నియోజకవర్గంలో జరిగే నారా లోకేష్ యాత్రలో టీడీపీతో పాటు జనసేన కూడా పాల్గొంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల(Telangana Elections) ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
