Buddha Venkanna : ఆ నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా
టీడీపీ బీసీల పార్టీ.. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న అన్నారు.
టీడీపీ(TDP) బీసీల పార్టీ.. తప్పకుండా ఎన్టీఆర్ జిల్లా(NTR District)లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న(Buddha Venkanna) అన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆయన స్పందిస్తూ.. విజయవాడ పశ్చిమ(Vijayawada West) నియోజకవర్గం నుంచి నేనే పోటీ చేస్తా.. ఇది ఆప్షన్-ఏ అని అన్నారు. పొత్తుల వల్ల కాదంటే. చంద్రబాబు(Chandrababu) మాటను కాదని ముందుకు వెళ్లనన్నారు. ఆయన నాకు దైవంతో సమానం.. ఆయన చెప్పినట్లే నడుచుకుంటానని స్పష్టం చేశారు.
అయితే ఆప్షన్ బి మరోకటి ఉంది.. నేను ఇక్కడ స్విచ్ వేస్తే.. ఆ జిల్లాలో లైట్లు వెలుగుతాయి. చంద్రబాబు శ్రీరాముడు అయితే.. నేను హనుమంతుడిని.. సీటు తప్పకుండా అడుగుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అడగకుండా అమ్మ అయినా అన్నం పెట్టదనేది వాస్తవం కదా.. బీసీ గా నాకు తప్పకుండా ఎమ్మెల్యే సీటు ఉంటుందేనేది తన విశ్వాసమన్నారు.
టీడీపీ కోసం నిలబడిన నాలుగైదురుల్లో బుద్దా వెంకన్న అనే వ్యక్తి ముందు ఉంటాడని కితాబిచ్చుకున్నారు. చంద్రబాబు కుటుంబంపై ఈగ వాలకుండా ముందు నిలబడిన వ్యక్తిని తాను అని పేర్కొన్నారు.
మాచర్లలో తురగా కిషోర్(Kishore) అనే వ్యక్తి నాపై కర్రతో దాడి చేశాడు.. జోగి రమేష్(Jogi Ramesh) చంద్రబాబు ఇంటి మీదకు వస్తే.. ఎదురొడ్డి నిలబడ్డాను.. కొడాలి నాని(Kodali Nani) నోటికొచ్చినట్లు కూస్తుంటే.. నేను అతన్ని నిలదీశానని వివరించారు. పొత్తులు ఉన్నాయి కాబట్టి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లను విజ్ఞప్తి చేస్తున్నా.. ఆప్షన్-ఏ ప్రకారం నా నియోజకవర్గంలో ఇవ్వకుంటే.. ఆప్షన్-బీ అయినా అమలు చేయాలని కోరతానని అన్నారు.
వచ్చే ఎన్నికల తర్వాత తప్పకుండా ఏదొక సభలో నేను అడుగు పెడతానని ధీమా వ్యక్తం చేశారు. రానున్నది చాలా క్లిష్ట పరిస్థితి.. డబ్బు, కులం కన్నా.. నా పక్కన నిలబడే నాయకుడు ఎవరని చూసుకోవాలని చంద్రబాబుకు చెప్పకనే చెప్పారు.
23 మంది టీడీపీలోకి వస్తే.. ఆ తర్వాత కేవలం ఒక్కరు మాత్రమే గెలిచారు. ఇప్పుడు మా పార్టీ నుంచి వైసీపీ(YSRCP)లోకి వెళ్లిన వారెవ్వరూ రేపు ఎన్నికలలో గెలవరు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు.. పార్టీ కోసం పని చేసే వారిని నాయకులు కూడా గుర్తించాలన్నారు. చంద్రబాబు నన్ను తప్పకుండా చట్ట సభల్లోకి తీసుకెళతారని విశ్వాసం వ్యక్తం చేశారు.