బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర రావు(KCR) అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం(Party Parliamentry Meeting) ప్రగతిభవన్(Pragathi Bhavan) లో శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో పార్టీ పోషించాల్సిన పాత్ర గురించి కేసీఆర్

బీఆర్ఎస్(BRS) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర రావు(KCR) అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం(Party Parliamentry Meeting) ప్రగతిభవన్(Pragathi Bhavan) లో శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో పార్టీ పోషించాల్సిన పాత్ర గురించి కేసీఆర్.. ఎంపీలకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర్‌రావు సహా ఎంపీలందరూ హాజ‌ర‌య్యారు సమావేశంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, కేంద్రం తెచ్చే బిల్లులు తదితర అంశాలపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహంపై అధినేత కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్న‌ట్లు తెలుస్తుంది.

Updated On 15 Sep 2023 4:40 AM GMT
Ehatv

Ehatv

Next Story