MLA KTR : రామోజీ రావు గారి మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది
స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న రామోజీ రావు(Ramoji Rao) గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు మాజీ మంత్రి కేటీఆర్(KTR). జీవితంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉన్నా సరే గొప్ప విజయాలను ఎలా సాధించవచ్చోనన్నది ఆయన ప్రస్థానం ద్వారా మనం నేర్చుకోవచ్చని అన్నారు.

MLA KTR
స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న రామోజీ రావు(Ramoji Rao) గారి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు మాజీ మంత్రి కేటీఆర్(KTR). జీవితంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉన్నా సరే గొప్ప విజయాలను ఎలా సాధించవచ్చోనన్నది ఆయన ప్రస్థానం ద్వారా మనం నేర్చుకోవచ్చని అన్నారు. తెలుగు మీడియా, వినోద రంగంలో ఆయనది చెరగని ముద్ర అని, ఎంతో అప్యాయత కలిగిన రామోజీ రావు గారంటే తనకు చాలా గౌరవమని కేటీఆర్ అన్నారు. గత దశాబ్ద కాలంలో చాలాసార్లు ఆయనతో మాట్లాడే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన మాటలతో తనలో ఎంతో స్ఫూర్తి నింపారని, అలాంటి గొప్ప మనిషి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు కేటీఆర్. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
