Harish Rao : రామోజీ భౌతికకాయానికి నివాళులర్పించిన హరీశ్‌రావు
రామోజీ ఫిల్మ్ సిటీలో(Ramoji film City) ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు భౌతిక కాయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) నివాళులర్పించారు. రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటని ఈ సందర్భంగా హరీశ్ రావు అన్నారు. ఇంకా ఏమన్నారంటే ' సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం.
రామోజీ ఫిల్మ్ సిటీలో(Ramoji film City) ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు భౌతిక కాయానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) నివాళులర్పించారు. రామోజీ రావు మృతి దిగ్బ్రాంతికి గురి చేసిందని, ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటని ఈ సందర్భంగా హరీశ్ రావు అన్నారు. ఇంకా ఏమన్నారంటే ' సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు చిరస్మరణీయులు. పత్రిక, టీవీ, సినిమా తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణం.
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. సమాజ హితం కోసం మీడియా ద్వారా కృషి చేశారు. ఏ రంగంలో అడుగుపెట్టినా.. తనదైన ముద్ర వేశారు. ప్రతి వ్యాపారంలో అగ్రగామిగా నిలిచారు. ఒక చిరుద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీ రావు.. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపారు. తెలుగు భాషను కాపాడేందుకు ఆయన చేసి కృషి ఎంతో గొప్పది.జర్నలిజం, సాహిత్య రంగాల్లో ఆయన చేసిన కృషి గొప్పది. సమాజ సేవ చేసి ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయారు' అని చెబుతూ ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని హరీశ్‌రావు ప్రార్థించారు.