తెలంగాణలో(Telangana) ఎన్నికల షెడ్యూల్‌(Election schedule) వచ్చేసింది. నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్‌(Assembly Elections) జరగనుంది. పార్టీలు జయాపజయాలను బేరీజు వేసుకుంటున్నాయి.

తెలంగాణలో(Telangana) ఎన్నికల షెడ్యూల్‌(Election schedule) వచ్చేసింది. నవంబర్‌ 30వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్‌(Assembly Elections) జరగనుంది. పార్టీలు జయాపజయాలను బేరీజు వేసుకుంటున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ మాత్రం విజయంపై కొండంత ధీమాతో ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని, దక్షిణ భారతదేశంలో మొదటిసారి హ్యాట్రిక్‌ సీఎంగా(Hatric CM) కేసీఆర్(CM KCR) రికార్డు సృష్టించబోతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అంటున్నారు.

తెలంగాణలో జరగనున్న ఎన్నికలు ఏకపక్షమేనని, రెండుసార్లు నిండుమనసుతో ఆశీర్వదించిన ప్రజలు మూడోసారి కూడా బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. డిసెంబర్ 3న వచ్చే ఫలితాలు బీఆర్‌ఎస్‌ పక్షానే ఉండబోతున్నాయని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. పదేళ్లలో ప్రజలను అందించిన అభివృద్ధి, సంక్షేమాలనే ప్రధాన అస్త్రాలుగా మార్చుకుని ప్రతిపక్షాలపై విజయం సాధిస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చిన తమ విశ్వసనీయతనే ఈ ఎన్నికల్లో తమ విజయమంత్రంగా మారుతుందని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న ప్రజా వ్యతిరేక శక్తులకు, తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎన్నికల్లో మరొకసారి ఓటమి తప్పదని, ప్రజల మద్దతుతో గులాబీ జెండాను ఎగరేస్తామన్నారు. నిరంతరం ప్రజలకు మంచి చేసిన బీఆర్‌ఎస్‌కు ప్రజలు ఓటు వేస్తారని, ప్రజలను ముంచిన కాంగ్రెస్, బీజేపీలపై వేటువేస్తారని కేటీఆర్‌ అన్నారు.ఈసారి వందకుపైగా అసెంబ్లీ స్థానాలు గెలిచి పాత రికార్డులను తిరగరాస్తామని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated On 9 Oct 2023 7:51 AM GMT
Ehatv

Ehatv

Next Story