వావివరుసలు లేని ఓ వ్యక్తి తన క్రూరత్వాన్ని బయటపెట్టాడు. తన కోరిక తీర్చలేదని వదిననే కడతేర్చాడు. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వావివరుసలు లేని ఓ వ్యక్తి తన క్రూరత్వాన్ని బయటపెట్టాడు. తన కోరిక తీర్చలేదని వదిననే కడతేర్చాడు. నెల్లూరు జిల్లా కావలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్‌(West Bengal)కు చెందిన శ్రీకాంత్‌(Srikanth) నెల్లూరు జిల్లా కావలిలో తన భార్య అర్పితా బిస్వాస్‌(Arpita Biswas) ఉంటున్నాడు. మొలల వ్యాధికి చికిత్స చేసే క్లీనిక్‌ను శ్రీకాంత్‌ నిర్వహిస్తన్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే శ్రీకాంత్‌ కుటుంబంతో పాటు వరుసకు తమ్ముడు అయ్యే నయ బిస్వాస్‌ వీరితోనే కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో అన్న భార్యపై కన్నేసిన బిస్వాస్ తన కోరిక తీర్చాలని తరుచూ వేధించేవాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి పలు సార్లు శ్రీకాంత్‌ను మందలించాడు కూడా. ఈ క్రమంలో శ్రీకాంత్ బిస్వాస్ తల్లిదండ్రులు తిరుపతి వెళ్లారు. శ్రీకాంత్, భార్య అర్పిత, నయ బిస్వాస్, ఇద్దరు పిల్లలు కలిసి నూతన సంవత్సర వేడుకుల జరుపుకున్నారు. శ్రీకాంత్ బిస్వాస్ మద్యం సేవించి నిద్ర పోయిన తర్వాత నయ బిస్వాస్ వదిన పడుకున్న గదిలోకి వెళ్లి తన కోరిక తీర్చాలని బెదిరించాడు. దీనికి వదిన అంగీకరించకపోవడంతో ఇనుపరాడ్‌తో తలపై బాది హత్య చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆమె మృతదేహాన్ని దగ్గరలో ఉన్న పంట కాలువలో పడేశాడు. ఉదయం నిద్రలేచిన తర్వాత శ్రీకాంత్ భార్య కోసం వెతికాడు. ఇంట్లో రక్తపు మరకలు ఉండడంతో స్థానికులతో కలిసి దగ్గరలో గాలించగా పంటకాలువలో భార్య మృతదేహం లభ్యమైంది. పోలీసులకు శ్రీకాంత్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ehatv

ehatv

Next Story