రక్తంపంచుకుని పుట్టిన అన్నపైన కోపం పెంచుకుని, ఆ కోపంతో ఏం చేయాలో పాలుపోక తెలంగాణ రాజకీయాల్లో పాదం మోపిన వైఎస్‌ షర్మల(YS Sharmila)ను తెలంగాణ(Telangana) ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. దాంతో పార్టీని కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేసేసి డి.కె.శివకుమార్‌(D.K.Shiva kumar) సహకారంతో

రక్తంపంచుకుని పుట్టిన అన్నపైన కోపం పెంచుకుని, ఆ కోపంతో ఏం చేయాలో పాలుపోక తెలంగాణ రాజకీయాల్లో పాదం మోపిన వైఎస్‌ షర్మల(YS Sharmila)ను తెలంగాణ(Telangana) ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. దాంతో పార్టీని కాంగ్రెస్‌(Congress)లో విలీనం చేసేసి డి.కె.శివకుమార్‌(D.K.Shiva kumar) సహకారంతో ఢిల్లీ(Delhi)లో చక్కర్లు కొట్టి ఎలాగోలా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పదవిని సంపాదించారు. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. కాలికి బలపం కట్టుకుని ఊరూరు తిరుగుతున్నారు. వెళ్లిన ప్రతిచోటా జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)ని తిడుతున్నారు. నిందారోపణలు చేస్తున్నారు. గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. పాపం షర్మిల ఇంతగా కష్టపడుతుంటే ఆమె భర్త అనిల్‌కుమార్‌(Anil Kumar) మాత్రం ఎన్నికల జోలికి వెళ్లకుండా హాయిగా ఇంటిపట్టునే ఉంటున్నారు. ప్రచారంలో పాల్గొనడం లేదు కానీ చెప్పాల్సిదంతా చెప్పేస్తున్నారు. బ్రదర్‌ అనిల్‌కుమార్‌గా దేవుడి మాటలు చెబుతున్నారు. 'దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. కొందరు డబ్బు కోసం, పదవి కోసం అమ్ముడుపోతారు. అన్యాయం చేసిన వారికి శిక్ష తప్పదు. ఇక్కడ మేనేజ్‌ చేసుకున్నా అక్కడ దేవుడి సన్నిధిలో శిక్ష తప్పదు' అంటూ సువార్త వినిపించారు. దీన్ని ప్రజలు చక్కగానే అర్థం చేసుకున్నారు. డబ్బుకు అమ్మడుపోవడం అంటే కడప నియోజకవర్గంలోని నాయకులు వీరి మాట వినడం లేదనేగా అర్థం. వీరు పెడుతున్న ప్రలోభాలకు వారు లొంగడం లేదట. షర్మిల దిక్కుకూడా చూడటం లేదట! దీంతో అనిల్‌కుమార్‌లో ఫస్ట్రేషన్‌ వచ్చేసింది. అందుకే వారంతా డబ్బుకు అమ్ముడుపోయినట్టుగా చెబుతున్నారు. అలాగే ఇక్కడ మేనేజ్‌ చేసుకున్నా, అక్కడ దేవుడి సన్నిధిలో శిక్ష తప్పదు అని అంటున్నారు. ఇక్కడ మేనేజ్‌ చేసుకున్నా అని అన్నారంటే అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy) గెలవబోతున్నారనేగా! మొత్తంమీద భార్య షర్మిల పరాజయం చెందుతారనే విషయాన్ని అనిల్‌ గ్రహించేశాడు. తమ మహిమతో కురిసే వర్షాన్ని కూడా ఆపేయగల సత్తా ఉన్న అనిల్‌కు తన భార్యను గెలిపించుకోలేడా? ఏమో మరి!

Updated On 30 April 2024 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story