మామూలుగా ఏ పురుగో(insect) పుట్రో తారసపడితే పెద్దగా పట్టించుకోము.

మామూలుగా ఏ పురుగో(insect) పుట్రో తారసపడితే పెద్దగా పట్టించుకోము. కాసింత వింతగా ఉంటే ఆసక్తిగా చూస్తాం.. వీలుంటే ఇంటికి పట్టుకెళతాం. అప్పట్లో బింగన్నలను తెచ్చుకునేవాళ్లం కదా! ఇట్టాగే ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) మాడుగుల నియోజకర్గం కోనాంలో అడవికి వెళ్లిన ఓ గిరిజనుడికి వింత కీటకం కనిపించింది. దాన్ని అతడు ఆకులో చుట్టి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కీటకం పేరు స్టాగ్‌ బీటిల్‌(stag beetle) అని, దాని విలువ కోటి రూపాయలు ఉంటుందని అతడికి తర్వాత తెలిసింది. ప్రపంచంలో అత్యంత అరుదైన కీటకం అది! ఔషధ తయారీలో వాడతారు. ఇంటికి తెచ్చుకున్నాడు కానీ దాన్ని ఏం చేయాలో పాలుపోవడం లేదు. పైగా అడవిలో తిరిగే ఆ కీటకానికి ఏ తిండి పెట్టాలో తెలియడం లేదు. తిండితిప్పలు లేక దాని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story