YCP Bus Yatra : 26 నుంచి వైసీపీ బస్సు యాత్ర.. ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే..
ఈ నెల 26న ఇచ్చాపురం(Ichchapuram) నుంచి బస్సు యాత్ర(Bus Yatra) మొదలవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సామాజిక బస్సు యాత్ర తొలి దశ షెడ్యూల్(First Shedule) ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

YCP Bus Yatra
ఈ నెల 26న ఇచ్చాపురం(Ichchapuram) నుంచి బస్సు యాత్ర(Bus Yatra) మొదలవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సామాజిక బస్సు యాత్ర తొలి దశ షెడ్యూల్(First Shedule) ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల వైసీపీ(YCP) పాలనలో ప్రజలకు జరిగిన మేలును, ప్రభుత్వం చేసిన పనులను వివరించేందుకే సామాజిక బస్సు యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ పేరుతో జనంలోకి వెళతామని చెప్పారు.
ఎన్నికల మేనిపేస్టోలో(Manifesto) ఇచ్చిన హామీలన్నీ వైసీపీ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం సహా వివిధ రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని.. సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని వివరించారు. రైతు భరోసా కేంద్రాలతో రైతాంగానికి జగన్ సర్కారు అండగా నిలబడుతోందని వెల్లడించారు. గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కన్న కలలను గ్రామ సచివాలయం ద్వారా నెరవేర్చామని.. దేశంలో ఈ ఘనత సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని బొత్స అన్నారు.
