అధికారంలో ఉన్నాం కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకోవడం అవివేకమని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిన శర్మ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో వేలాది ఓట్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా, అన్యాయంగా తొలగించడం అప్రజాస్వామికమని ఆమె తెలిపారు.

అధికారంలో ఉన్నాం కదా అని ఏం చేసినా చెల్లుతుందనుకోవడం అవివేకమని బీజేపీ (BJP) అధికార ప్రతినిధి సాదినేని యామిన శర్మ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో వేలాది ఓట్లను ఇష్టారాజ్యంగా, అక్రమంగా, అన్యాయంగా తొలగించడం అప్రజాస్వామికమని ఆమె తెలిపారు. దొంగ ఓట్లతో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీకి (YCP) రాష్ట్ర ఎన్నికల సంఘం షాకిచ్చిందని చెప్పారు. ప్రతి ఓటును పరిశీలించాలనే నిర్ణయం తీసుకున్న ఈసీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామిక నిర్ణయాలను వైసీపీ మానుకుంటే మంచిదని పేర్కొన్నారు. సీఎం సొంత జిల్లా కడపలోని బుక్కాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు బెదిరించి మతమార్పిడి చేయిస్తున్నారని, అడ్డుకునే ప్రయత్నం చేసిన తల్లిదండ్రులను, గ్రామస్తులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన మండల విద్యాశాఖ అధికారి కూడా ఆమెకే వత్తాసు పలకడం చూస్తుంటే రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు ఎంతలా పెరిగిపోతున్నాయో అర్థమవుతోందని చెప్పారు. .ముఖ్యమంత్రి, విద్యాశాఖ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తరపున డిమాండ్‌ చేస్తున్నానని సాదినేని యామిని శర్మ తెలిపారు.

Updated On 25 Aug 2023 8:26 AM GMT
Ehatv

Ehatv

Next Story