వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం తిరుమలకు వెళుతున్నారు.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(Ex CM Ys Jagan Mohan Reddy) శుక్రవారం తిరుమలకు వెళుతున్నారు. శనివారం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల లడ్డూ(Tirumala Laddu)పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandra Babu Naidu) చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని జగన్‌ అంటున్నారు. శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలలో పూజలు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్‌ హిందూ కాదని, అన్య మతస్థుడని, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ నాయకురాలు పురందేశ్వరి(BJP Purandeswari) డిమాండ్‌ చేస్తున్నారు. చంద్రబాబు(Chandrababu) కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇంతకు ముందు జగన్‌ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళితే డిక్లరేషన్ ఇవ్వలేదన్నది చంద్రబాబు అభియోగం. అయితే ఇప్పటికే చాలా సార్లు జగన్‌ తిరుమలకు వచ్చిన స్వామిని దర్శించుకున్నారని, అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌(YCP Leaders) నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ, కూటమి నేతలు జగన్ తిరుమలకు వస్తే డిక్లరేషన్ తీసుకొని మాత్రమే అనుమతించాలని టీటీడీ(TTD) అధికారులను కోరుతున్నారు. దీంతో జగన్‌ తిరుమల పర్యటనపై ఉత్కంఠ ఏర్పడింది. 2012లో జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు. అప్పుడే టీటీడీ అధికారులు డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలని జగన్‌ను కోరారు. అయితే తాను 2009లోనే డిక్లరేషన్ ఇచ్చానని జగన్‌ అప్పుడు చెప్పారు. ఆ సమయంలో టీటీడీ ఈవో(TTD EO)గా పని చేస్తున్న ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం(LV Subramanyam) చెప్పినట్టుగా ఉన్న ఓ క్లిప్పింగ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒకసారి డిక్లరేషన్ ఇస్తే చాలని, తిరుమలకు వెళ్లిన ప్రతీ సారీ ఇవ్వాల్సిన అవసరం లేదని ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం చెప్పినట్టుగా ఉంది. మరి రేపు జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తారా? ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా? అన్నది ఉత్కంఠగా మారింది.

ehatv

ehatv

Next Story