ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(AP BJP) పరిస్థితి ఏమిటి? టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమిలోకి బీజేపీ ఎందుకు రావడం లేదు? ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? బీజేపీ ఎటువైపు ఉంటుంరాజకీయాలలో వీటిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొన్నామధ్య ఏపీ బీజేపీ సమావేశంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళితే బాగుంటుందని నాయకులంతా సూచించారట! దీనిపై ఓ తీర్మానం చేసి దాన్ని కేంద్ర నాయకత్వానికి పంపించారట కూడా! టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల బరిలో దిగుతుందనే వార్తలు కూడా వినిపించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ(AP BJP) పరిస్థితి ఏమిటి? టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమిలోకి బీజేపీ ఎందుకు రావడం లేదు? ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు? బీజేపీ ఎటువైపు ఉంటుంరాజకీయాలలో వీటిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మొన్నామధ్య ఏపీ బీజేపీ సమావేశంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలు వెళితే బాగుంటుందని నాయకులంతా సూచించారట! దీనిపై ఓ తీర్మానం చేసి దాన్ని కేంద్ర నాయకత్వానికి పంపించారట కూడా! టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికల బరిలో దిగుతుందనే వార్తలు కూడా వినిపించాయి. దీనిపైన తెలుగుదేశంపార్టీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీనిపై బీజేపీ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేకపోయేసరికి చాలా మంది నిజమే అయివుంటుందనుకున్నారు. జనవరి మూడు నాలుగు వారాలలో ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితులపై బీజేపీ కేంద్రనాయకత్వం ఓ సర్వే చేయించింది. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారని సర్వేలో తేలింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా నమ్ముతోంది. అందుకే అక్కడ పొత్తులకు సంబంధించిన అంశంలో వీలైనంత మట్టుకు దూరంగా ఉండాలని అనుకుంటోంది. ఎలాగూ జగన్మోహన్‌రెడ్డినే అధికారంలోకి వస్తున్నారు కాబట్టి టీడీపీతో అంటకాగాల్సిన అవసరం లేదని భావిస్తోంది. అయిదేళ్లుగా బీజేపీకి జగన్ నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరిస్తున్నారు.

Updated On 6 Feb 2024 5:16 AM GMT
Ehatv

Ehatv

Next Story