Sujana Chowdary : అమరావతిని అంగుళం కూడా కదలనివ్వం
అమరావతిని ఉక్కు పాదంతో అణిచివేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన వైసిపి అరాచక పాలనకు ప్రజలందరూ చరమగీతం పాడాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు.

BJP Leader Sujana Chowdary Fire on YSRCP Govt
అమరావతిని ఉక్కు పాదంతో అణిచివేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన వైసిపి అరాచక పాలనకు ప్రజలందరూ చరమగీతం పాడాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ఏపీ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. అమరావతిని అంగుళం కూడా కదలనివ్వమని.. ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజధానిని అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు.
విజయవాడ నియోజవర్గంలోని ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తానన్నారు. నియోజవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారు చూపించే ప్రేమాభిమానాలు ఆదరణ మరిచిపోలేనివని అన్నారు. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోనని.. పార్టీలకతీతంగా అందరి అభిమానాన్ని చూరగొని భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్నారు.
