Vishnu Kumar Raju : చంద్రబాబు రిమాండ్ తీర్పు.. జడ్జిపై విచారణ జరగాలన్న బీజేపీ నేత
జగన్ మాస్టర్ ప్లాన్ తో చంద్రబాబును అరెస్ట్ చేసి ప్రజలను డైవర్ట్ చేశారని.. ప్రతిష్టాత్మక జీ20 సదస్సు చూసే భాగ్యం జగన్ కలిగించలేదని.. లోకేశ్ పాదయాత్రకూ అడ్డుకట్ట వేసేలా మాస్టర్ ప్లాన్ వేశారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.

BJP leader demands an inquiry against the judge on Chandrababu’s remand order
జగన్(Jagan) మాస్టర్ ప్లాన్ తో చంద్రబాబు(Chandrababu)ను అరెస్ట్(Arrest) చేసి ప్రజలను డైవర్ట్(Divert) చేశారని.. ప్రతిష్టాత్మక జీ20 సదస్సు చూసే భాగ్యం జగన్ కలిగించలేదని.. లోకేశ్(Lokesh) పాదయాత్రకూ అడ్డుకట్ట వేసేలా మాస్టర్ ప్లాన్ వేశారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు(Vishnu Kumar Raju) వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఆశ్చర్యపోయేలా జడ్జి తీర్పు ఇచ్చారని అన్నారు. చంద్రబాబును రిమాండ్ నకు ఇవ్వడంపై జడ్జిపై శాఖాపరమైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
చంద్రబాబు రిమాండ్(Remand) తో వైసీపీ(YCP) వాళ్లు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకోవడం సైకోయిజమే అని అన్నారు. సీఐడీ ఈ స్కామ్ లో అధికారులను ఎందుకు చేర్చలేదు? అని ప్రశ్నించారు. జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. రఘురామకృష్ణ రాజు(Raghuramakrishna Raju)ని ఖతం చేయాలని జగన్ చూశారు. 2014 తర్వాత జగన్ లా టీడీపీ(TDP), బీజేపీ(BJP) ఆలోచన చేసుంటే మీ పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని అన్నారు. హౌస్ అరెస్ట్ చేసి విచారణ జరపాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. జగన్ సంపాదనపై విచారణ జరిపిస్తే ప్రపంచం నివ్వెరపోయేలా ఆస్తులు బయటపడతాయని అన్నారు. 2024లో వైసీపీకి 25 కంటే ఎక్కువ సీట్లు రావు విష్ణుకుమార్ రాజు జోష్యం చెప్పారు.
