ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి వంగలపూడి అనితపై(vangalapudi anitha) హీరోయిన్‌, బీజేపీ(BJP) నాయకురాలు మాధవీలత(Madhavilatha) ఫైరయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి వంగలపూడి అనితపై(vangalapudi anitha) హీరోయిన్‌, బీజేపీ(BJP) నాయకురాలు మాధవీలత(Madhavilatha) ఫైరయ్యారు. వినాయక చవితి(vinayaka chaturthi) సందర్భంగా చలాన్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై మాధవీలత ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయక మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అన్ని మతాలు, పండుగలు సమానమంటారు కానీ హిందు పండగలు వచ్చేసరికి ఎందుకు ఇలా వ్యవహరిస్తారు? అంటూ నిలదీశారు మాధవీలత. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఆంధ్రప్రదేశ్‌లో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని అడిగారు. గణేశ్ మండపాల దగ్గర ఈ చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ మరింత పెద్ద క్లాస్‌ తీసుకున్నారు.

ఇంకా మాధవీలత ఏమన్నారంటే ... 'ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు మీ ముఖాన వేస్తారు. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి. అన్ని మతాలు , పండగలు సమానం, అందరూ సమానమని చెప్పి.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మంటపాలకి, మా గణేశ్‌ ఎత్తుకి డబ్బులెందుకో? అనితక్కా?.. ఏంది మీ తిక్కా? ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ?? ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డని మానభంగం చేశాడు. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇపుడు మేమిచ్చే చిల్లర భిక్షతో లాయర్‌ను పెడతారా?' అంటూ ఘాటుగా రాసుకొచ్చారు.

మాధవీలత నచ్చావులే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అంతకు ముందు యాంకర్‌గా ఉన్నారు. నచ్చావులే తర్వాత స్నేహితుడు, అరవింద్‌-2 వంటి సినిమాలో నటించారు. హీరోయిన్‌ కాకమునుపు మహేశ్‌బాబు హీరోగా వచ్చిన అతిథిలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా నటించారు.

Eha Tv

Eha Tv

Next Story