సినీ హీరోయిన్‌, బీజేపీ(BJP) నాయకురాలు మాధవీలత ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనితపై(Vangalapudi anitha) సుతిమెత్తగా విమర్శలు చేశారు.

సినీ హీరోయిన్‌, బీజేపీ(BJP) నాయకురాలు మాధవీలత ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి వంగలపూడి అనితపై(Vangalapudi anitha) సుతిమెత్తగా విమర్శలు చేశారు. వినాయకుడి విగ్రహాలు, మండపాల ఏర్పాటు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సింగిల్‌విండో విధానం తీసుకువచ్చిన విషయంపై మాధవీలత ఫైరవ్వడం, ఆ వెంటనే అనిత దానికి రియాక్టవ్వడం మనం చూశాం, విన్నాం. వినాయకచవితి మండపాల అనుమతులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని అనిత చెప్పుకొచ్చారు. అది వైసీపీ హయాంలో నిర్ణయించిన రుసుములను అధికారులు ఇచ్చిన నోట్ ప్రకారం చెప్పానని అనిత చెబుతూ తప్పును సరి చేసుకునే ప్రయత్నం చేశారు. దీనికి మాధవీలత మళ్లీ కౌంటర్‌ ఇచ్చారు. 'వినాయకుడి విగ్రహాలకు సంబధించి అడుగుకు ఇంత చొప్పున వసూలు చేయడమన్నది అక్షర సత్యం. అది పాత జీవో అని అనిత చెబుతున్నారు. పాత జీవోలు మండపాలకు తప్ప విగ్రహాలకు అడుగుకు ఇంత రేటు అన్న విషయం లేనే లేదు. ఇది పచ్చి అబద్ధం. ఓవరాల్ మండపానికి మాత్రమే డిఫరెంట్ రేటు ఉండింది. లాస్టియర్‌, అంతకు ముందు సంవత్సరం మా వాళ్లు కూడా ఆంధ్రాలో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మండపాలు పెట్టారు. వాళ్లు కూడా ఫీజులు పే చేశారు. ఇలా అడుగు చొప్పున అడుగడుగు చొప్పున ఒక్కో గణేషుడికి ఒక్కో రేటు, ఎకో గణేషుడికి ఓ రేటు ఇవి లేవు. ఇవి కచ్చితంగా కొత్త రూల్సే! చంద్రబాబునాయుడుగారు(Chandrababu) మార్చి ఉంటారు. పది రోజుల కిందట మార్చారట! మరి మార్చినప్పుడు ప్రజలకు చెప్పాలికదా! అన్ని చోట్లా, రాష్ట్రమంతటా పది రోజుల్లో ఈ సందేశం వెళ్లదు కదా! ప్రజలకు వివరించాలి కదా! అయితే నేను ఏమి మాట్లాడినా సరే, జనాలు వెంటనే ఓ.. నువ్వు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YCP) దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా! అని అంటారు. భలే కామెడీగా అనిపిస్తుంటుంది. నేను వైసీపీ దగ్గరో, కాంగ్రెస్‌ దగ్గరో డబ్బులు తీసుకోవడమే ఏమిటి? కాషాయం కండువా మోసేవాళ్లమబ్బా.. వేరే రంగుల మీద మోజు లేదు నాకు. కొత్తగా ఏదైనా చెప్పండి' అని మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు.

Updated On 9 Sep 2024 6:48 AM GMT
Eha Tv

Eha Tv

Next Story