కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah) అసలు విషయాన్ని చెప్పేశారు. చంద్రబాబునాయుడుతో పొత్తు కోసం బీజేపీ(BJP) తెగ ప్రయత్నిస్తోందని ఇంతకాలం టీడీపీ(TDP) అనుకూల మీడియా ఊదరగొట్టేసింది కదా! బీజేపీతో దోస్తానా ఇష్టం లేకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించాల్సి వస్తుందని రాతలు రాస్తూ వచ్చింది కదా! ఇందులో ఏ మాత్రం నిజం లేదని అమిత్ షా తేల్చేశారు.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా(Amit Shah) అసలు విషయాన్ని చెప్పేశారు. చంద్రబాబునాయుడుతో పొత్తు కోసం బీజేపీ(BJP) తెగ ప్రయత్నిస్తోందని ఇంతకాలం టీడీపీ(TDP) అనుకూల మీడియా ఊదరగొట్టేసింది కదా! బీజేపీతో దోస్తానా ఇష్టం లేకపోయినా గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించాల్సి వస్తుందని రాతలు రాస్తూ వచ్చింది కదా! ఇందులో ఏ మాత్రం నిజం లేదని అమిత్ షా తేల్చేశారు. చంద్రబాబుకు(Chandrababu) బుద్ధి రావడం వల్లనే మళ్లీ ఆయన బీజేపీ దగ్గరకు వచ్చారని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని(Narendra Modi) అప్పట్లో చంద్రబాబు టెర్రరిస్ట్ అని కామెంట్‌ చేశారు కదా, అలాంటి వ్యక్తితో మీరు పొత్తు ఎలా కుదుర్చుకున్నారు అని అమిత్‌ షాను యాంకర్‌ అడిగినప్పుడు కుండబద్దలు కొట్టినట్టు జవాబిచ్చారు. 'నిజమే ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంద్రబాబు టెర్రరిస్ట్‌ అన్నారు. అలా చెప్పి ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్నారు. మేమేమీ ఆయనను వెళ్లమని చెప్పలేదు. ఆయనంతట ఆయనే వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పుడు చంద్రబాబుకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మా దగ్గరకు వచ్చారు. తిరిగి ఎన్‌డీఏలో కలుస్తానన్నారు. కలుస్తానని ఆయన వచ్చారు కదా అందుకే కలుపుకున్నాం' అని అమిత్‌షా అన్నారు. ఇన్ని రోజులుగా బీజేపీనే తమను పిలిచిందని, ఎన్డీయేలో చేరాలంటూ ఆహ్వానం పంపిందని టీడీపీ నేతలు అరిగిపోయిన రికార్డునేశారు. ఎన్డీయేలో చేరేందుకు చంద్రబాబు బీజేపీకి పలు షరతులు పెట్టారని టీడీపీ అనుకూల మీడియా తెగ ప్రచారం చేసింది. ఇవన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది.

Updated On 16 March 2024 1:29 AM GMT
Ehatv

Ehatv

Next Story