AP Cabinet Expansion : లోకేష్ గారి మంత్రులు అవుట్... మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుంతుందో.?
ఆంధ్ర ప్రదేశ్లో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా, లోకేష్ గారి ముద్ర వున్న మంత్రులు కు, పదవి గండం పొంచివుందని, సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది.

ఆంధ్ర ప్రదేశ్లో మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా, లోకేష్ గారి ముద్ర వున్న మంత్రులు కు, పదవి గండం పొంచివుందని,సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది.సీఎం చంద్రబాబు గారికి వున్న ఏకైక బలహీన, మంత్రి లోకేష్ గారే.. లోకేష్ గారికి అనేక బలహీనతలు ఉన్నప్పటికీ వాటిలో అతి ముఖ్యమైనది, ఆయన కోటరీయే. చంద్రబాబు గారికి ఎవ్వరైనా చెబితే తప్పకుండా వింటారని ప్రచారం వుంది.
సీనియర్ ఎమ్మెల్యే లకు, టీడీపి(TDP) సీనియర్ నాయుకులుకు నమ్మకం వుంది.. మంత్రి లోకేష్(Nara lokesh) గారికున్న నమ్మకమే ఆయన కోటరీ యే నట.. చతుష్టయం గా పిలవబడుతున్న, లోకేష్ గారి కోటరీ లో వున్న వారే, ఆయన కొంప ముంచటం ఖాయం అని టీడీపి సీనియర్ నేతలే ఆఫ్ ధి రికార్డు గా కామెంట్లు చేస్తున్నారట.ఇది ఆయనకు తెలియదు.తెలుసుకోరు..తెలుసుకునేటప్పటికే, జరగవలిసిన నష్టం జరిగిపోవటం ఖాయం.
మంత్రివర్గం లో లోకేష్ గారి మంత్రులుగా పేరున్న వారిని, మంత్రి పదవులునుండి, సిఎం చంద్రబాబు (CM Chandrababu) గారు తొలిగించ బోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అంత దైర్యం సిఎం చంద్రబాబు గారికి ఉందా? కొడుకు ను ఇబ్బంది పెట్టే విధంగా, సీఎం చంద్రబాబు గారు నిర్ణయం తీసుకోగలరా?
లోకేష్ గారి సిపర్సులు కు విలువిచ్చి, కొంతమంది కి మంత్రి పదవులు ఇస్తే, వారిలో ఎక్కువమంది పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.అక్రమాలకు కూడా పాల్పడినట్లు ఆధారాలతో వారు దొరికి పోయారు.. లోకేష్ గారి సిపర్సులు చేసినపుడే, వారికి మంత్రి పదవులు ఇవ్వకుంటే బాగుండేది.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా, జరగవలిసిన నష్టం జరుగుతుంది.బలమైన ప్రత్యర్థి, జగన్ రెడ్డి గారిని, మంత్రి లోకేష్ గారే సమర్ధవంతంగా ఎదుర్కోలేరు.ఇక ఆయన సిపార్సు చేసిన, అసమర్ధత మంత్రులు, ఎలా ఎదురుకోగలరు?
చంద్రబాబు లాంటి అపార రాజకీయ,అధికారం అనుభవం వున్న నేతకే,కొడుకు బలహీనతా ఆవరించింది. లోకేష్ గారి ముద్రన్న మంత్రుల పైనే ఎక్కువుగా అవినీతి ఆరోపణలు వచ్చాయన్నది నిజం.వైసిపి నాయుకులుతో కూడా అంటకాగిన విషయం అంత కన్నా నిజం..లోకేష్ సిపార్సులతో మంత్రులు అయిన వారిలో, కొండపల్లి శ్రీనివాస్ గారు, రాంప్రసాద్ రెడ్డి గారు.. కొల్లు రవీంద్ర గారులుతో పాటు మరి కొంతమంది వున్నారు.. వీరందరిని పదవులు నుండి తొలిగించి, పార్టీ సీనియర్ ఎమ్మెల్యే లకు,సీఎం చంద్రబాబు గారు మంత్రి పదవులిస్తారా? పదవులు ఇవ్వగలరా? తన వారిని మంత్రి పదవులు నుండి, తప్పిస్తే మంత్రి లోకేష్ గారు ఊరుకుంటారా?
