మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన పోక్సో కేసు కీలక మలుపు తిరిగింది.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై నమోదైన పోక్సో కేసు కీలక మలుపు తిరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యర్థులపై కక్ష పూరితంగా కేసులు పెడుతున్నదనడానికి చెవిరెడ్డి ఉదంతమే రుజువు. తిరుప‌తి జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఎర్రావారిపాలెం మండలంలోని య‌ల‌మంద‌లో ప‌దో త‌ర‌గ‌తి ద‌ళిత విద్యార్థినిపై దాడి రాజ‌కీయ రంగు పులుముకుంది. ఈ ఘటనలో చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. తనపై కక్షపూరితంగా కేసు నమోదు చేశారని, ఆప‌ద‌లో ఉన్న ద‌ళిత కుటుంబానికి సాయం చేయ‌డానికి వెళ్లానని చెవిరెడ్డి చెబుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చారు. విద్యార్థిని తండ్రి జరిగిందేమిటో స్పష్టంగా చెప్పారు. 'నేను ఎవ‌రి మీద ఫిర్యాదు చేయ‌లేదు. నా కుమార్తెపై దాడి జ‌రిగింద‌ని మేమే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాం. మా కోస‌మే ఆయ‌న వ‌చ్చారు. మీడియాలో పాప‌పై ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో, వాటిని ఆపేందుకు ఖాళీ పేప‌ర్ల‌పై సంత‌కం చేయాల‌ని పోలీసులు చెప్పారు. అందులో ఏమున్న‌దో మాకు తెలియ‌దు. నా బిడ్డ‌కు సాయం చేయ‌డానికి వ‌చ్చిన వాళ్ల‌పై నేనెందుకు కేసు పెడ‌తాను?' అని బాలిక తండ్రి చెప్పుకొచ్చారు. అంటే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పెట్టిన పోక్సో కేసు వెనుక ఏం జరిగిందో ప్రజలకు తెలిసిపోయింది.

ehatv

ehatv

Next Story