Big Twist in Anantapur : యువకుడి ప్రేమలో పడి మోసపోయిన ఇద్దరు యువతులు..!
ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతులు వాస్మాయిల్ తాగారు.

ఓ యువకుడు ఇద్దరు యువతులను ప్రేమించి మోసం చేయడంతో మనస్తాపం చెందిన యువతులు వాస్మాయిల్ తాగారు. ఇందులో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బత్తలపల్లి మండలం గెరిశనపల్లికి చెందిన దివాకర్ అనంతపురంలో బళ్లారి రోడ్డులోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతను గతంలో ముదిగుబ్బకు చెందిన రేష్మ అనే యువతిని ప్రేమించాడు. పెద్దలు రేష్మకు వివాహం చేసినా పెళ్లయిన నెలకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. మళ్లీ దివాకర్‌తో ప్రేమాయణం కొనసాగించింది. దివాకర్‌కు రూ.2 లక్షలకుపైగా డబ్బు కూడా ఇచ్చింది. దివాకర్ రేష్మకే ప్రేమను పంచాలనుకోలేదు.. తన ప్రేమను మరొకరితో పంచుకునేందుకు కణేకల్లు మండలం ఎర్రగుంటకు చెందిన శారదను ముగ్గులోకి దించాడు. ఇటు రేష్మ, అటు శారదను ఒంటి చేత్తో డీల్ చేయడం మొదలెట్టాడు. ఇద్దరితోను చనువుగా మెలిగాడు. ఈ మధ్యనే దివాకర్‌పై శారదకు అనుమానం వచ్చి ఇన్‌స్టాను పరిశీలించింది. రేష్మతో అతడితో ఉన్న బంధం బయటపడింది. రేష్మ కూడా దివాకర్‌ను ఇదేంటని నిలదీసింది. రేష్మను తల్లిదండ్రులు బంధువుల ఇంటికి పంపిచారు. దివాకర్‌తో ఫోన్ మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో దివాకర్‌తో రేష్మ ఫోన్‌లో వాగ్వాదం పెట్టుకోవడంతో రేష్మను బైక్ మీద తీసుకొచ్చి అనంతపురంలో శారద ఉంటున్న హాస్టల్‌లో వదిలివెళ్లాడు. దివాకర్‌ను రేష్మ, శారద పిలిపించి తమ ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని కోరారు. తాను ఇద్దరినీ చేసుకోనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు యువతులు ఆర్టీఓ కార్యాలయం వద్దకు వెళ్లి వాస్మాయిల్ తాగారు. విషయం దివాకర్‌కు తెలియజేయడంతో వెంటనే అక్కడకు వెళ్లి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శారద మృతిచెందింది. రేష్మ కొంత మొత్తంలో వాస్మాయిల్ తాగడంతో బతికి బయటపడిందని.. అయితే శారదను వాస్మాయిల్ ఎక్కువ తాగించడంలో రేష్మ పాత్రపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
