ఇటీవల జగన్ మార్కాపురం టూర్ లో బాలినేనికి చేదు అనుభవం ఎదురైంది. వైయస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ మార్కాపురం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హెలిపాడ్ వద్దకు మంత్రులు, ఇతర నేతలు బయలుదేరారు. అదే సమయంలో పోలీసులు బాలినేని అడ్డుకున్నారు. వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో బాలినేని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎస్పి, ఇతర నేతలు వారించిన శాంతించలేదు.

మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పు సమయం నుంచి అసంతృప్తిగా ఉన్న బాలినేని.. పలుమార్లు బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. అయితే అధినేత జగన్ బుజ్జగింపులు వల్ల అలక వీడారు. బాలినేని అసంతృప్తికి కేవలం మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడమే కారణమా.. లేక మరేదైనా ఇతర కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.స్వయానా జగన్ బంధువైన బాలినేని అసంతృప్తిపై పార్టీలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇటీవల జగన్ మార్కాపురం టూర్ లో బాలినేనికి చేదు అనుభవం ఎదురైంది. వైయస్సార్ ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ మార్కాపురం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హెలిపాడ్ వద్దకు మంత్రులు, ఇతర నేతలు బయలుదేరారు. అదే సమయంలో పోలీసులు బాలినేని అడ్డుకున్నారు. వాహనం పక్కనపెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో బాలినేని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎస్పి, ఇతర నేతలు వారించిన శాంతించలేదు. కార్యక్రమంలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. చివరికి సీఎం జగన్ కల్పించుకొని ఫోన్లో మాట్లాడడంతో మళ్లీ సభకు వచ్చారు. ఇలా బాలినేని అలక వహించిన ప్రతిసారి జగన్ సర్ది చెబుతూనే ఉన్నారు. మరి రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడానికి కారణం ఏంటో.. ఈసారి జగన్ సర్ది చెప్పినా బాలినేని వింటారో వినరో వేచి చూడాల్సిందే.

Updated On 29 April 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story