తెలుగుదేశం పార్టీ(TDP Party). నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న పార్టీ, ఒకప్పుడు వైభవోపేతంగా వెలిగిన పార్టీ, సుమారు దశాబ్దంన్నర పాటు అధికారం చెలాయించిన పార్టీ, దాదాపు అంతేకాలం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఇప్పుడు పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrabbau) ప్రస్తుతం రాజమండ్రి జైలు(Rajahmundry Central Jail)లో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ(TDP Party). నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న పార్టీ, ఒకప్పుడు వైభవోపేతంగా వెలిగిన పార్టీ, సుమారు దశాబ్దంన్నర పాటు అధికారం చెలాయించిన పార్టీ, దాదాపు అంతేకాలం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఇప్పుడు పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrabbau) ప్రస్తుతం రాజమండ్రి జైలు(Rajahmundry Central Jail)లో ఉన్నారు. అధినేత జైలులో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని నడిపించాల్సిన నారా లోకేశ్‌(Nara Lokesh) ఎక్కువ సమయం ఢిల్లీ(Delhi)లోనే ఉంటున్నారు. నందమూరి బాలకృష్ణ(Balakrishna) తెలంగాణకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ టీడీపీ బాధ్యతలను చూసుకుంటున్నారు. మరి చుక్కాని లేని నావలా తయారైన తెలుగుదేశం పార్టీని గట్టుకు చేర్చే బాధ్యతను ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటే క్యాడర్‌ నుంచి వ్యతిరేకత రాదు?

కష్టాలలో ఉన్న తెలుగుదేశంపార్టీ స్థానంలో నెమ్మదిగా భర్తి చేయాలనుకుంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan)కు ఆ అవకాశాలు లేకుండా చేయాలని ఓ వర్గం ప్రయత్నిస్తున్నది. ఇవన్నీ నందమూరి బాలకృష్ణ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్నది విశ్వసనీయ సమాచారం. పురంధేశ్వరి(Purandeswari)తో టచ్‌లోనే ఉన్నామని ఇటీవల బాలకృష్ణ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యమేమిటో, అంతరార్థమేమిటో తెలుసుకుంటే టీడీపీలో ఏం జరుగుతుందో సులభంగానే అర్థమవుతోంది. ప్రస్తుతం పార్టీని నడిపించగల శక్తి సామర్థ్యాలు లోకేశ్‌కు లేవన్నది చాలా మంది అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితులలో లోకేశ్‌కు నాయకత్వం అప్పగిస్తే పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుందని అనుకుంటున్నారు. పార్టీ పగ్గాలను బ్రాహ్మణి చేపడితే బాగుంటుందని కొందరు బహిరంగగానే అన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు బీజం ఎక్కడ పడిందో తెలుసుకోవాలంటే జైలులో చంద్రబాబును పరామర్శించడానికి బాలకృష్ణ, లోకేశ్‌లు వెళ్లినప్పుడు జరిగిందేమిటో పునశ్చరణ చేసుకోవాలి. అప్పుడు వీరిద్దరి మీద చంద్రబాబుకు నమ్మకం లేక పక్క పార్టీ అధినేత పవన్‌ కల్యాన్‌పైనే భారమంతా మోపారు. ప్రెస్‌మీట్‌లో పవన్‌ హావభావాలను, ఆయన మాట్లాడిన తీరు టీడీపీ క్యాడర్‌కు ఆశ్చర్యాన్ని కలిగించింది. కుడి ఎడమల్లో లోకేశ్‌, బాలకృష్ణలను పెట్టుకుని టీడీపీకి తానే శరణ్యమన్నట్టుగా మాట్లాడారు పవన్‌. దీన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారన్నది ఇన్‌సైడ్‌ టాక్‌! అందుకే పార్టీ పగ్గాలు తమ చేజారిపోకుండా ఉండేందుకు ప్రణాళిక చేస్తున్నారు పార్టీ పెద్దలు. పురంధేశ్వరితో బాలకృష్ణ టచ్‌లో ఉంటున్నది కూడా అందుకే! చంద్రబాబు అందుబాటులో లేని సమయంలో పార్టీని దగ్గుబాటి వెంకటేశ్వరరావు(Daggubati Venkateswara Rao) నడిపిస్తే బాగుంటుందన్నది బాలకృష్ణ ఆలోచన. ఇటీవల ఎన్టీఆర్‌ పేరిట వంద రూపాయల నాణేన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమమంతా దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలోనే జరిగింది. అప్పుడు పురంధేశ్వరి కారులోనే బాలకృష్ణ వచ్చారు. ఈ సన్నివేశం చంద్రబాబుకు కొంచెం ఇరుకున పెట్టే ఉంటుంది. ఇప్పుడు పురంధేశ్వరితో తరచూ బాలకృష్ణ మాట్లాడుతున్నది టీడీపీ భవిష్యత్తు గురించేనని అనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును తిరిగి టీడీపీలోకి రప్పించి బాధ్యతలు అప్పగించాలన్నది బాలయ్య తాపత్రయం. పురంధేశ్వరి కూడా అందుకు అంగీకరించినట్టు సమాచారం. తాను బీజేపీలో ఉంటూ భర్తను టీడీపీలో పంపించడం సరైందేనా అంటే తప్పదు. పురంధేశ్వరి బీజేపీలో ఉన్నప్పుడే కదా వెంకటేశ్వరరావు వైసీపీలో చేరింది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. కాబట్టి భార్యాభర్తలు వేర్వేరు పార్టీలలో ఉండటం సర్వసాధారణమే!
దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్లీ టీడీపీలోకి రాబోతున్నారని, ఇందుకో బాలకృష్ణ మధ్యవర్తిత్వం వహించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాకపోతే అప్పడు సమయం కుదరలేదు. సందర్భమూ రాలేదు. కానీ ఇప్పుడు సమయము, సందర్భమూ రెండూ దగ్గుబాటికి అనుకూలంగా వచ్చాయి. ఒకవేళ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశంపార్టీలోకి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారడం ఖాయం.

Updated On 7 Oct 2023 2:13 AM GMT
Ehatv

Ehatv

Next Story