రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైసీపీ(Ycp) తన సత్తాను చాటుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన ‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైసీపీ(Ycp) తన సత్తాను చాటుకుంది. అధికార కూటమి నేతలు ఎంత ప్రయత్నాలు చేసినా వైఎస్‌ఆర్సీపీ ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC), వార్డుసభ్యులు ఆ పార్టీకే మద్దతుగా నిలిచారు. తాము గెలిచిన పార్టీ వైఎస్సార్‌సీపీ జెండాను గట్టిగా పట్టుకుని మరోసారి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఎన్ని రకాలుగా ప్రలోభపెట్టినా అధికార టీడీపీ వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. ఒక జడ్పీ చైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్‌ఎంపీపీ, 8 కో ఆప్షన్‌ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి 50 స్థానాలకు గురువారం ఎన్నికలు జరగగా, 40 స్థానాల్లో (ఇందులో ఒక వైస్‌ ఎంపీపీ రెబల్‌) వైఎస్సార్‌సీపీ గెలిచింది. ఆరు స్థానాల్లో టీడీపీ(TDp), రెండు చోట్ల జనసేన, ఒకచోట బీజేపీ గెలిచింది. వివిధ కారణాలతో ఏడు స్థానాలకు ఎన్నిక వాయిదా పడింది. వైఎస్‌ఆర్‌ జిల్లా వైసీపీ జెడ్పీ చైర్మన్‌గా బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి కలెక్టర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ డిక్లరేషన్‌ అందజేసి, ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లాలోని 48 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడ ఉండగా. ఐదుగురు వైఎస్సార్‌సీపీ సభ్యులను టీడీపీలో చేరారు. ఒక జెడ్పీటీసీ సభ్యుడు హాజరుకాలేదు. దీంతో 41 మంది వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు.

ehatv

ehatv

Next Story