Nara Bhuvaneshwari : చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని భువనేశ్వరి ప్రత్యేక పూజలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

Bhuvaneshwari special pooja for Chandrababu to stay healthy
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case)లో రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీ(Remand Prisoner)గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆరోగ్యంగా ఉండాలని ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం రాజమండ్రిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి నారా భువనేశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. రాజమండ్రి నాళం భీమరాజు వీధిలో ఉన్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. భువనేశ్వరి వెంట బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా ఉన్నారు. పూజల అనంతరం మధ్యాహ్నం సమయంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి(Brahmani)లతో పాటు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) చంద్రబాబుతో భేటీ కోసం సెంట్రల్ జైలుకు వెళ్లారు. ములాఖత్ లో ఈ ముగ్గురూ చంద్రబాబును కలిసి మాట్లాడారు.
