Family Mulakath With Chnadrababu : ముగిసిన ములాఖత్.. బాబును కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు
చంద్రబాబుతో(Chandrababu) నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari), బ్రాహ్మణి(Brahmini) ములాఖత్ అయ్యారు. కుటుంబసభ్యులతో పాటు అచ్చెన్నాయుడు(Achchennaidu) కూడా చంద్రబాబును కలిశారు. జైలు అధికారులు ములాఖత్ కు 40 నిమిషాల సమయం ఇచ్చారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఆరోగ్యంపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు ఆరా తీశారు.
చంద్రబాబుతో(Chandrababu) నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari), బ్రాహ్మణి(Brahmani) ములాఖత్ అయ్యారు. కుటుంబసభ్యులతో పాటు అచ్చెన్నాయుడు(Achchennaidu) కూడా చంద్రబాబును కలిశారు. జైలు అధికారులు ములాఖత్ కు 40 నిమిషాల సమయం ఇచ్చారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఆరోగ్యంపై చంద్రబాబును అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులపై చంద్రబాబు ఆరా తీశారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా సీఐడీ అధికారులు విచారించారని చంద్రబాబు వారితో అన్నట్లు తెలుస్తుంది. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు బ్రాహ్మణిని ప్రత్యేకంగా కోరారని నివేదికలు చెబుతున్నాయి. చంద్రబాబును చూసి భువనేశ్వరి కంటతడి పెట్టుకోగా.. అధైర్య పడవద్దని.. నిబ్బరంగా ఉండాలని ధైర్యం చెప్పారు. తనయుడు లోకేశ్ గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు బాసటగా నిలవాలని నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడుకు సూచించారని పేర్కొన్నారు. ప్రభుత్వం నిరసనకారులపై వ్యవహరిస్తున్న తీరును బ్రాహ్మణి.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు వారికి సూచించినట్లు కథనాలు వైరల్ అవుతున్నాయి.