ఓ యువకుడు చదివిందే తొమ్మిదో తరగతి. కానీ అతను ఇస్రోలో(ISRO) హెచ్‌ఆర్‌ ఉద్యోగం(HR Job) చేస్తున్నానని నమ్మబలికాడు.

ఓ యువకుడు చదివిందే తొమ్మిదో తరగతి. కానీ అతను ఇస్రోలో(ISRO) హెచ్‌ఆర్‌ ఉద్యోగం(HR Job) చేస్తున్నానని నమ్మబలికాడు. అంతేకాదు అతనికి 100 ఎకరాల పొలం(Property) ఉందని, రెండు విల్లాలున్నాయని పెద్దరాయుడు సినిమాలో రజినీకాంత్‌లా(Rajinikanth) బిల్డప్‌. మ్యాట్రీమోనీ(Matrimony) ద్వారా వల వేసి నలుగురిని పెళ్లి(Marriage) చేసుకున్నాడు. భారత్‌ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో కల్యాణ్‌(Kalyan) పేరుతో రిజిస్టర్‌ చేసుకొని ఆ తర్వాత కల్యాణ్‌రెడ్డిగా పేరు మార్చుకున్నాడు. పెళ్లి సంబంధాల పేరుతో తన తండ్రి మాట్లాడుతున్నట్లుగా నమ్మిస్తాడు. కట్నకానుకలు అవసరం లేదని పెళ్లి చూపులకు వెళ్తాడు. పెళ్లి కూతురు నచ్చిందంటూ వారి వివరాలు, వారి బంధువుల వివరాలూ సేకరిస్తాడు. ఇస్రోలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మించి మోసం చేయడంతో పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

నెల్లూరు(Nellore) జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందిన ఆశం అనిల్‌బాబు(Anil babu) చదివింది మాత్రం 9వ తరగతే. భారత మ్యాట్రిమోనిలో మాత్రం కల్యాణ్‌రెడ్డిగా నమోదుచేసుకొని తనకు ఇస్రోలో ఉద్యోగం ఉందని.. 100 ఎకరాల పొలం ఉందని, రెండు విల్లాలు కూడా ఉండేవని నమ్మిస్తాడు. జనాలను నమ్మించేందుకు హైదరాబాద్‌లో ఒక ఫాం హౌస్‌, బెంగళూరులో ఒక విల్లాను కిరాయికి తీసుకుని అవి తనవే అని బిల్డప్‌ ఇస్తాడు. హైదరాబాద్‌లో ఒక పీఏ, వాచ్‌మన్‌, ఒక మహిళా అసిస్టెంట్‌, ఇద్దరు బౌన్సర్లను పెట్టుకున్నాడు. సలహాలు ఇచ్చేందుకు కాశీ అనే వ్యక్తిని, పెళ్ళి చేసేందుకు పంతులును సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఏలూరు జిల్లా గుండుగొలను గ్రామానికి చెందిన మహిళను ఇదేవిధంగా నమ్మించాడు. ఆమె రెండో కూతురును పెళ్లి చేసుకుంటానని, మూడో కూతురుకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి వారి నుంచి ఆన్‌లైన్‌లో రూ.9.53 లక్షలు కాజేశాడు. మరో వ్యక్తి ద్వారా ఇంటర్వ్యూ చేయించి ఫేక్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చాడు. జాబ్‌లో చేర్పించకపోగా తిరిగి డబ్బులు ఇవ్వలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. దర్యాప్తు చేసిన పోలీసులు నిత్య పెళ్లికొడుకు అనిల్‌బాబును అరెస్ట్‌ చేశారు. అనిల్‌బాబు ఇంతవరకూ పలువురిని రూ.1.50 కోట్ల వరకూ మోసగించినట్లు తేలింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప జిల్లాకు చెందిన తుంగ శశాంక, నంద్యాల జిల్లాకు చెంది పల్లె హేమంత్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.2 లక్షల నగదు, ఐదు మొబైల్స్, 13 సిమ్‌ కార్డులు, రెండు ల్యాప్‌ట్యాప్‌లు, బ్యాంక్‌ చెక్‌బుక్కులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Eha Tv

Eha Tv

Next Story