Bhatti Vikramarka : సంక్షేమం, అభివృద్ధి తన రెండు కళ్ళుగా కృషి చేసిన ఘనుడు వైఎస్ఆర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajashekar Reddy) జయంతి సందర్భంగా గాంధీ భవన్(Gandhi Bhavan) లో సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఘన నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్సాఆర్ (YSR)సమాజం అభివృద్ధి చెందాలని.. సంక్షేమం, అభివృద్ధి తన రెండు కళ్ళుగా కృషి చేసిన ఘనుడు అని కొనియాడారు.

Bhatti Vikramarka
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajashekar Reddy) జయంతి సందర్భంగా గాంధీ భవన్(Gandhi Bhavan) లో సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఘన నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైస్సాఆర్ (YSR)సమాజం అభివృద్ధి చెందాలని.. సంక్షేమం, అభివృద్ధి తన రెండు కళ్ళుగా కృషి చేసిన ఘనుడు అని కొనియాడారు. పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నత విద్య చదవాలని స్కాలర్ షిప్స్ ఇచ్చిన మహా నేత అన్నారు. రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు ప్రైవేశ పెట్టిన నేత అని గుర్తుచేశారు. మహిళల కోసం డ్వాక్రా రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు సంక్షేమ పథకాలు తెచ్చిన నేత.. ముందు చూపుతో హైదరాబాద్ నగరం దాహార్తి తీర్చేందుకు కృష్ణ(Krishna), గోదావరి(Godhavari) నది జలాలు నగరానికి తీసుకువచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని పేర్కొన్నారు. ఐదు ఏళ్లలో లక్షల ఎకరాలకు నీళ్ళు అందించిన గొప్ప నాయకుడు వైఎస్ఆర్ అని కీర్తించారు. ముందు చూపుతో ఐఐఐటీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టిన గొప్ప దార్శనికుడని అని అన్నారు. వైఎస్ చెప్పిన చివరి మాట రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అని గుర్తుచేశారు. రాజశేఖర్ రెడ్డికి నివాళి అర్పించేందుకు వచ్చిన కేవీపీకి ధన్యవాదాలు తెలిపారు.
