Rally Case On Chandrababu : హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీపై పోలీస్ కేసు నమోదు
స్కిల్ స్కామ్ కేసులో(Skill development case) ఏపీ హైకోర్టు(AP High court) మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరుచేయడంతో చంద్రబాబు(chnadrababu) మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. విడుదల అనంతరం రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఆయన.. బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు.
స్కిల్ స్కామ్ కేసులో(Skill development case) ఏపీ హైకోర్టు(AP High court) మధ్యంతర బెయిల్(Interim bail) మంజూరుచేయడంతో చంద్రబాబు(chnadrababu) మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. విడుదల అనంతరం రాజమండ్రి నుంచి ఉండవల్లి నివాసానికి వెళ్లిన ఆయన.. బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఇంటి వరకూ ర్యాలీగా వెళ్లారు. అయితే ఈ ర్యాలీలో పలువురు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలావుంటే.. చంద్రబాబు ర్యాలీపై బేగంపేట పోలీసులు(Begumpet police) కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన(Election Code voilation) కింద కేసు నమోదు అయ్యింది. అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో కేసు నమోదుచేశారు. రెండు గంటల పాటు రోడ్లపై న్యూసెన్స్ చేసి.. ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని సబ్ ఇన్స్పెక్టర్ జయచందర్(Jayachander) చేసిన ఫిర్యాదు మేరకు.. నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 341,290,21 రెడ్ విత్ 76సీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ర్యాలీ నిర్వహించిన హైదరాబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రెటరీ జీవీజీ నాయుడు సహా పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. సుమారు 400మంది వరకు ఈ ర్యాలీలో పాల్గొన్నారని పోలీసులు పేర్కొన్నారు. ర్యాలీ వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవడంతో పాగు.. బేగంపేట నుంచి పంజాగుట్ట వరకూ దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.