తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిలో మరోసారి ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయం సమీపంలో శ‌నివారం అర్ధ‌రాత్రి ఎలుగుబంటి సంచరించిన‌ట్లుగా చెబుతున్నారు. ఎలుగుబంటిని చూసి భక్తులు భయాందోళనతో పరుగులు తీశార‌ని వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

తిరుమల(Tirumala)కు వెళ్లే అలిపిరి నడకదారిలో మరోసారి ఎలుగుబంటి(Bear) సంచారం కలకలం రేపింది. నరసింహస్వామి ఆలయం(Narasimhaswamy Temple) సమీపంలో శ‌నివారం అర్ధ‌రాత్రి ఎలుగుబంటి సంచరించిన‌ట్లుగా చెబుతున్నారు. ఎలుగుబంటిని చూసి భక్తులు భయాందోళనతో పరుగులు తీశార‌ని వార్త‌లు వైర‌ల్(Viral) అవుతున్నాయి. అటవీశాఖ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు చేప‌డుతున్నారు.

అయితే.. తిరుమల నడకదారిలో వ‌న్య మృగాల‌ సమస్యను ఆధిగమించడానికి శాశ్వతంగా కంచె నిర్మించే విషయంపై ఆలోచిస్తున్నట్టు శ‌నివారం రాష్ట్ర అటవీ, విద్యుత్, గనుల, పర్యావరణ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి(Pediireddy Ramchandra Reddy) తెలిపారు. తిరుమల నడకదారిలో చిరుతపులుల దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల చిరుత దాడిలో చిన్నారి మరణించడం దురదృష్టకర సంఘటన గా పేర్కొంటూ.. మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షలు ఎక్స్ గ్రేసియా అందించామని చెప్పారు.

Updated On 20 Aug 2023 9:21 PM GMT
Yagnik

Yagnik

Next Story