Medical Student Suicide : మీకు ఇదేం పాడు బుద్ది రా బాబు.. సెక్సువల్ హరాష్మెంట్‌తో విద్యార్థి ఆత్మహత్య
సెక్సువల్ హరాష్మెంట్‌తో విద్యార్థి ఆత్మహత్య
నెల్లూరులో(Nellore) ఉన్న నారాయణ డెంటల్ కాలేజ్‌లో(Narayana Dental college) విద్యార్థి ఆత్మహత్య(Suicide) సంచలనంగా మారింది. బీడీఎస్(BDS) రెండో ఏడాది చదువుతున్న ప్రదీప్ (19)ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్న తల్లిదండ్రులు, పోలీసులు షాక్ తిన్నారు. మరో ముగ్గురు విద్యార్థులు గత ఏడాదిన్నర కాలంగా తనను లైంగికంగా(Sexual harrasment) వేధిస్తున్నారని కాలేజ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం
నెల్లూరు వాసి అయిన నారాయణ కుటుంబసభ్యులతో కలిసి తాడిపత్రికి వలస వెళ్లారు. తాడిపత్రి శివారులోని గన్నెవారిపల్లిలో కాలనీలో నివాసం ఉంటూ సిమెంట్ రింగ్‌లు తయారుచేసి వాటిని అమ్ముకుంటూ జీవిస్తున్నారు. నారాయణకు అఖిల్, ప్రదీప్ అని ఇద్దరు కుమారులున్నారు. చిన్నకుమారుడు ప్రదీప్ నెల్లూరులోని నారాయణడెంటల్ కాలేజ్‌లో బీడీఎస్ రెండో ఏడాది చదువుతున్నాడు. పెద్దకుమారుడు అఖిల్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రాహుల్ అనే విద్యార్థితో పాటు తనను మరో ఇద్దరు కలిసి ఏడాదిన్నరగా లైంగికంగా వేధిస్తున్నారని, దీంతో తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని అన్నకు మెసేజ్ పెట్టాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అన్న అఖిల్ కాలేజ్‌కు, తల్లిండ్రులకు ఫోన్ చేశాడు. ఈలోపే కాలేజ్ భవనంపై నుంచి పడి దూకి చనిపోయాడు. సోమవారం అర్ధరాత్రి ఫోన్ చేసి తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన నెల్లూరు వెళ్లిన తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. కష్టపడి కన్న కొడుకులను పెంచానని ఇంక కొన్నిరోజుల్లోనే ప్రయోజకుడిగా తిరిగివస్తాడనుకున్న ప్రదీప్ తీరిగిరాని లోకాలు వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిదండ్రుల రోదన బంధువులు, స్థానికులను కలిచివేసింది. ప్రదీప్ స్వస్థలం కూడా నెల్లూరు కావడంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు..