సాధారణ భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో మననం చేసుకుంటూ వెళ్లిపోతారు.

సాధారణ భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకుని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో మననం చేసుకుంటూ వెళ్లిపోతారు. సెలెబ్రిటీలకు ఆ చాన్స్‌ ఉండటం లేదు. మీడియా వారిని చుట్టుముడుతోంది. మైకులు పెట్టేసి ప్రశ్నలడుగుతోంది. నిజంగానే ఇది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తున్నది చాలా మందికి. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఓ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ అందులో కొన్ని షరతులు విధించడమే అనుమానానికి తావిస్తున్నది. నిషేధం విధిస్తే ప్రతి రాజకీయ ప్రసంగాన్ని నిషేధించాలి. కానీ అందులో విద్వేషపూరిత అనే మాటను ఎందుకు చేర్చినట్టు? అంటే ప్రభుత్వ అనుకూల వ్యక్తులు మాట్లాడితే అభ్యంతరం చెప్పరన్నమాట! కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వాన్ని విమర్శించే వారికి మాత్రం కొండపై మాట్లాడే ఛాన్స్‌ ఉండదన్నమాట! రాజకీయ నాయకులు దర్శనం తర్వాత ఆలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు విమర్శలు చేస్తున్నారని అందువల్ల ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందన్నది టీటీడీ భావన. అందుకే రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ బోర్డు ఇటీవల ఓ తీర్మానం చేసింది. ఆ ప్రకారం ఉత్తర్వులు వచ్చాయి. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత.. ప్రభుత్వాన్ని పొగిడేవాళ్లకైతే అనుమతి ఇస్తారేమో అన్న సందేహం కలుగుతోంది. టీటీడీకి చిత్తశుద్ధి ఉంటే రాజకీయ నాయకుల ప్రసంగాలను పూర్తిగా నిషేధించాలని భక్తులు కోరుకుంటున్నారు.

ehatv

ehatv

Next Story